KTR | రూ. 402 కోట్లతో కొత్త క్యాంపస్ నిర్మించాలి.. సిరిసిల్ల జేఎన్టీయూపై సీఎంకు కేటీఆర్ లేఖ
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ( JNTU ) ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ).. సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి లేఖ రాశారు.
KTR | త్రినేత్ర న్యూస్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ( JNTU ) ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ).. సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి లేఖ రాశారు. కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 2021లో రూ.402 కోట్ల పరిపాలనా అనుమతులతో మంజూరైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో కళాశాల ప్రస్తుతం అగ్రహారంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు.
కళాశాలను ప్రస్తుత ప్రాంగణం నుంచి మరో ప్రైవేటు భవనానికి తరలించే ప్రతిపాదనలు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు నిరుపయోగం కాకుండా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని, కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు కళాశాలను ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేందుకు అనుమతించాలని కేటీఆర్ కోరారు.
తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కళాశాల ప్రస్తుత ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ఈ కళాశాల కీలకమని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Adluri Laxman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరికి తప్పిన పెను ప్రమాదం
- ●Jaya Saradhi Reddy | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో సీనియర్ జర్నలిస్ట్..?
- ●Devi Navaratri | దేవీ నవరాత్రులు చేయలేకపోతున్నారా..? ఈ మూడు రోజులు చేస్తే చాలు..!
- ●Green India Challenge-Maharashtra | ఊరూరికో జమ్మి చెట్టు.. మహారాష్ట్రలోనూ శ్రీకారం
- ●Vaishnavi Chaitanya | టాలీవుడ్‌కు బ్రేక్ - కోలీవుడ్‌పై కన్నేసిన బేబీ హీరోయిన్ - రొమాంటిక్ జానర్లో డెబ్యూ మూవీ
- ●Sharannavaratri | ఇంద్రకీలాద్రికి శరన్నవరాత్రి శోభ.. తొలిరోజు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

Adluri Laxman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరికి తప్పిన పెను ప్రమాదం

Jaya Saradhi Reddy | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో సీనియర్ జర్నలిస్ట్..?

Devi Navaratri | దేవీ నవరాత్రులు చేయలేకపోతున్నారా..? ఈ మూడు రోజులు చేస్తే చాలు..!

Green India Challenge-Maharashtra | ఊరూరికో జమ్మి చెట్టు.. మహారాష్ట్రలోనూ శ్రీకారం






