త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toxic Trailer | అంద‌మే ఆయుధం – టాక్సిక్ ట్రైల‌ర్ రిలీజ్ – కేజీఎఫ్‌తో కంపేరిజ‌న్స్‌

య‌శ్ హీరోగా న‌టించిన టాక్సిక్ ట్రైల‌ర్ శ‌నివారం రిలీజైంది. యాక్ష‌న్ అంశాల‌తో హాలీవుడ్ స్టైల్ విజువ‌ల్స్‌తో ట్రైల‌ర్ అదిరిపోయింది. అయితే ఈ ట్రైల‌ర్‌లోని డైలాగ్స్‌, విజువ‌ల్స్ కేజీఎఫ్‌ను గుర్తుకుతెస్తున్నాయ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

N

News | Published On Aug 8, 2026, 8.03 pm IST

Toxic Trailer | అంద‌మే ఆయుధం – టాక్సిక్ ట్రైల‌ర్ రిలీజ్ – కేజీఎఫ్‌తో కంపేరిజ‌న్స్‌
Advertisement

Toxic Trailer |కేజీఎఫ్ ఫేమ్ య‌శ్ హీరోగా న‌టించిన టాక్సిక్ మూవీ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. మ‌ద‌ర్ సెంటిమెంట్‌, యాక్ష‌న్, ఎమోష‌న‌ల్ అంశాల‌తో ఈ ట్రైల‌ర్‌ ఆస‌క్తిక‌రంగా సాగింది. విజువ‌ల్స్ హాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా ఉన్నాయి.

విషాదాన్ని దాచ‌లేం....

వ‌ర్షంలో య‌శ్‌తో పాటు ఏడుస్తూ ఓ చిన్నారి క‌నిపించే సీన్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ముసుగేసుకొని మొహంపై ఉన్న దుఃఖాన్ని దాచిపెట్టొచ్చు...నుదిటిపై ఉన్న విషాదాన్ని దాచిపెట్ట‌లేం అంటూ కియారా అద్వానీ చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. నా ఆశ ఏంటో తెలుసా రాయ‌.. ఈ సిటీని ఏలాలి అంటూ స్టైలిష్‌గా డైలాగ్ చెబుతూ ట్రైల‌ర్‌లోకి న‌య‌న‌తార ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయిల‌కు అంద‌మే అస‌లైన సింగారం. ఆ అందాన్నే ఆయుధంగా వాడితే ఎలా బంగారం అంటూ య‌శ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

మూడు లుక్‌ల‌లో...

ఈ ట్రైల‌ర్‌లో య‌శ్ మూడు డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో క‌నిపించాడు. గ‌డ్డం లేకుండా ఓ డిఫ‌రెంట్ లుక్‌లో స‌ర్‌ప్రైజ్ చేశాడు. య‌శ్‌పై వ‌చ్చిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ట్రైల‌ర్‌లో అదిరిపోయాయి. వ‌య‌లెన్స్ కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 సినిమాల‌కు మించి ఉండ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

కేజీఎఫ్‌తో కంపేరిజ‌న్స్‌

టాక్సిక్ ట్రైల‌ర్‌ను చాలా మంది నెటిజ‌న్లు కేజీఎఫ్‌తో కంపేర్ చేస్తున్నారు. కొన్ని డైలాగ్స్‌, విజువ‌ల్స్‌, యాక్ష‌న్ సీన్లు అచ్చం కేజీఎఫ్‌లానే ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ కంపేరిజ‌న్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

గీతూ మోహ‌న్ దాస్‌...

కేజీఎఫ్ త‌ర్వాత య‌శ్ హీరోగా న‌టిస్తున్న మూవీ ఇది. పీరియాడిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి గీతూమోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వ‌సంత్‌, న‌య‌న‌తార‌, కియారా అద్వానీ, తారా సుతారియా హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.
850 కోట్ల బ‌డ్జెట్‌....
టాక్సిక్ మూవీ క‌న్న‌డ‌, ఇంగ్లీష్‌తో పాటు మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాది మార్చిలో రిలీజ్ కావాల్సిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల డిలే వ‌ల్ల ఆగ‌స్ట్ 26కు వాయిదాప‌డింది. దాదాపు 850 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది.

Advertisement
Advertisement