త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | తెలంగాణ‌లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల కంటే ఎక్కువ‌గా ప‌నిచేస్తున్న పోలీసు శాఖ‌: కేటీఆర్‌

KTR | తెలంగాణ‌లో పోలీస్ శాఖ కాంగ్రెస్ (Congress) కార్య‌క‌ర్త‌ల కంటే ఎక్కువ‌గా ప‌నిచేస్తున్న‌ద‌ని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. సోమ‌వారం త‌న పీఆర్ఓ మ‌హేశ్‌, పీఏ మ‌హేంద‌ర్ రెడ్డిపై పోలీస్ స్టేష‌న్‌లోనే దాడి జ‌రిగింద‌న్నారు.

G

Telangana | Published On Sep 15, 2026, 12.06 pm IST

KTR | తెలంగాణ‌లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల కంటే ఎక్కువ‌గా ప‌నిచేస్తున్న పోలీసు శాఖ‌: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో పోలీస్ శాఖ కాంగ్రెస్ (Congress) కార్య‌క‌ర్త‌ల కంటే ఎక్కువ‌గా ప‌నిచేస్తున్న‌ద‌ని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. సోమ‌వారం త‌న పీఆర్ఓ మ‌హేశ్‌, పీఏ మ‌హేంద‌ర్ రెడ్డిపై పోలీస్ స్టేష‌న్‌లోనే దాడి జ‌రిగింద‌న్నారు. దాడికి ప్రయత్నించింది గుండాలా?, పోలీసులా?, మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు ఎవరో తేలాలి? అని డిమాండ్ చేశారు. తమ వారిపై జరిగిన దాడిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన నాయకుడు, రెండుసార్లు ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డిన ఒక సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ (KTR) ఇంటిపైన దాడి జ‌రిగింది. ఆ తర్వాత ఈ దాడిని ఆపాలని పోలీస్ స్టేషన్‌‌కు వెళ్తే తమపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. నిన్న (సోమ‌వారం) మళ్లీ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లోపల తన పీఆర్వో, పీఏలపై 15 మందితో దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు.

పోలీస్ స్టేషన్‌లో దాడికి ప్రయత్నించింది గుండాలా? పోలీసులా? మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు ఎవరో తేలాల‌ని డిమాండ్ చేశారు. త‌మ‌ వారిపై జరిగిన దాడి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే కూడా చేయలేద‌న్నారు. గుండాలు పోలీస్ స్టేషన్‌లో దాడులకు తెగబడిన వారికి మద్దతిచ్చి ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడం లేదని విమ‌ర్శించారు. త‌న‌ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు దాడి చేసిన వారిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినా పోలీసులు నమోదు చేయలేద‌ని మండిప‌డ్డారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని ఘోరమైన పరిస్థితి తెలంగాణలో నెలకొందని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఈ అంశంపై కోర్టులను ఆశ్రయిస్తామని.. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరాశ నిస్పృహల్లో ఉంద‌ని, అందుకే ప్రతిరోజు అటెన్షన్ డైవర్షన్‌కి పాల్పడుతుందని విమ‌ర్శించారు. వెయ్యి రోజుల తర్వాత మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ దాడులకు తెగబడుతున్నదని ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement