త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Global Village Dubai | గ్లోబల్ విలేజ్ 31వ సీజన్.. అక్టోబర్ 14 నుంచి సందడి..

Global Village Dubai | దుబాయ్‌లోని ప్రముఖ బహుళసాంస్కృతిక వినోద, ఆహార, షాపింగ్ గమ్యస్థానం గ్లోబల్ విలేజ్ 31వ సీజన్‌కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ వచ్చే ఏడాది మే వరకు కొనసాగనుంది. రాష్ట్ర మీడియా కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది.

S

International | Published On Sep 15, 2026, 11.50 am IST

Global Village Dubai | గ్లోబల్ విలేజ్ 31వ సీజన్.. అక్టోబర్ 14 నుంచి సందడి..
Advertisement

Global Village Dubai | దుబాయ్‌లోని ప్రముఖ బహుళసాంస్కృతిక వినోద, ఆహార, షాపింగ్ గమ్యస్థానం గ్లోబల్ విలేజ్ 31వ సీజన్‌కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ వచ్చే ఏడాది మే వరకు కొనసాగనుంది. రాష్ట్ర మీడియా కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. 2026 సీజన్‌లో ఈ ప్రాంతంలోని ప్రముఖ కుటుంబ వినోద కేంద్రం మరిన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు, కొత్త ఆకర్షణలు, ప్రత్యేక అనుభవాలతో సందర్శకులను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 14 బుధవారం నుంచి గ్లోబల్ విలేజ్ తలుపులు తెరుచుకుని 2027 మే వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆక‌ట్టుకున్న గ‌త సీజ‌న్‌..

గత సీజన్‌లో గ్లోబల్ విలేజ్‌లో 90కుపైగా సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే 30 పెవిలియన్లు ఏర్పాటు చేశారు. 3,500కుపైగా షాపింగ్ అవుట్‌లెట్లు, కనీసం 200 గేమ్స్, రైడ్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. గ్లోబల్ విలేజ్ 30వ సీజన్ సందర్భంగా మూడు ప్రధాన ఆకర్షణలను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈజిప్ట్ పెవిలియన్ నుంచి చైనా పెవిలియన్ వరకు విస్తరించిన గార్డెన్స్ ఆఫ్ ది వరల్డ్ అనే ఉత్సవ కార్నివాల్, వివిధ థీమ్ గదులతో కూడిన డ్రాగన్ కింగ్‌డమ్ వాక్-త్రూ ఆకర్షణ, పిల్లల కోసం ఇండోర్ అడ్వెంచర్ పార్క్ ది లిటిల్ వండరర్స్ ఎట్ కార్నివాల్ ఇందులో ఉన్నాయి. గత సీజన్‌లో మెయిన్ స్టేజ్, ఫియస్టా స్ట్రీట్‌ను కూడా విస్తరించారు. గతంలో రైల్వే మార్కెట్‌గా ఉన్న ప్రాంతాన్ని పునరుద్ధరించి డెజర్ట్ డిస్ట్రిక్ట్‌గా మార్చారు.

ప్ర‌వేశ రుసుము ఎంత‌..

1997లో ప్రారంభమైన గ్లోబల్ విలేజ్ తొలినాళ్లలో వివిధ దేశాల సంస్కృతులను ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చిన్న కియోస్క్‌ల సమాహారంగా ఉండేది. అక్కడ ప్రామాణికమైన ఆహారం, హస్తకళలు, సాంస్కృతిక ప్రదర్శనలను అందించేవారు. కాలక్రమేణా గ్లోబల్ విలేజ్ విస్తరిస్తూ వచ్చింది. దుబాయ్ క్రీక్ సమీపంలోని తాత్కాలిక ప్రాంతం నుంచి మరింత పెద్ద ప్రదేశాలకు తరలిన ఈ పార్క్, చివరకు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ సమీపంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. గ్లోబల్ విలేజ్ ప్రవేశ టికెట్ల ధర సాధారణంగా వారాంతాల్లో శుక్రవారం, శనివారం రోజుల్లో 30 దిర్హామ్‌లు, ఆదివారం నుంచి గురువారం వరకు 25 దిర్హామ్‌లుగా ఉంటుంది. మూడేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఆటిజంతోపాటు ఇతర ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. ప్రభుత్వ సెలవు రోజులు మినహా మంగళవారాలను మహిళలు, కుటుంబాల కోసం ప్రత్యేకంగా కేటాయించ‌నున్నారు.

Advertisement
Advertisement