DCP shilpavalli | కేటీఆర్ పీఏ, పీఆర్వోపై ఎలాంటి దాడి జరగలేదు : డీసీపీ శిల్పవల్లి
DCP shilpavalli | సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్‌రెడ్డిలపై ఎలాంటి భౌతిక దాడి జరగలేదని ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి స్పష్టం చేశారు.
DCP shilpavalli | త్రినేత్ర.న్యూస్ : సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్‌రెడ్డిలపై ఎలాంటి భౌతిక దాడి జరగలేదని ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి స్పష్టం చేశారు. వారిపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆమె తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా డీసీపీ శిల్పవల్లి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ప్రారంభం రోజున జరిగిన వివాదం నేపథ్యంలో కేటీఆర్ పీఏ, పీఆర్వోలను సోమవారం సైఫాబాద్ పీఎస్‌లో విచారించాం. సోమవారం సాయంత్రం కొంతమంది యువకులు గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో డీజే అనుమతి కోసం పీఎస్‌కు వచ్చారు. ఆ సమయంలో మహేశ్, మహేందర్ కూడా స్టేషన్‌లోనే ఉన్నారు. అయితే డీజేకు అనుమతి నిరాకరిస్తూ సైఫాబాద్ సీఐ వారితో కొద్దిగా దురుసుగా మాట్లాడారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కేటీఆర్ పీఆర్వోను ఆ యువకుల్లో ఒకరు గుర్తించి.. అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ చేసిన వాళ్లనేమో పీఎస్‌లో మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడతారు, మాకేమో పర్మిషన్ ఇవ్వరా అని వారితో వాగ్వాదానికి దిగారు. అలా మాట్లాడొద్దని సీఐ వారించడంతో యువకులు పోలీస్‌స్టేషన్ నుంచి వెళ్లిపోయారని వివరించారు. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పరిణామాలపై సీసీటీవీ కెమెరాలను పరిశీలించామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిలపై ఎలాంటి దాడి జరగలేదని వివరణ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేశారని, దానిపై విచారణ జరుపుతున్నామని ఆమె తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Balapur Ganesh | రూ. 40 లక్షల వ్యయంతో బాలాపూర్ గణేశ్ మండపం ఏర్పాటు.. ప్రత్యేకత ఏంటంటే..?
- ●Ramya Krishnan | కమల రెడ్డిగా శివగామి - మంచు మనోజ్ సినిమాలో పవర్ఫుల్ రోల్
- ●Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
- ●Stock Markets | ఊహించినట్లే జరిగింది.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.9 లక్షల కోట్లు ఆవిరి..
- ●BJP MLA Parag Shah Beggar | రూ.3,300 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్లు, సెక్యూరిటీ వదిలేసి ముంబై రోడ్లపై బిచ్చగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే
- ●DK Shivakumar | ట్రంప్ కూడా కాంగ్రెస్ పథకాలనే కాపీ కొడుతున్నారు.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Balapur Ganesh | రూ. 40 లక్షల వ్యయంతో బాలాపూర్ గణేశ్ మండపం ఏర్పాటు.. ప్రత్యేకత ఏంటంటే..?

Ramya Krishnan | కమల రెడ్డిగా శివగామి - మంచు మనోజ్ సినిమాలో పవర్ఫుల్ రోల్

Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

Stock Markets | ఊహించినట్లే జరిగింది.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.9 లక్షల కోట్లు ఆవిరి..





