త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cheyutha Pension | చేయూత‌ పెన్ష‌న్.. నేటితో ముగియ‌నున్న‌ ద‌ర‌ఖాస్తులు

Cheyutha Pension | రాష్ట్రంలో చేయూత పెన్షన్ల ((Cheyutha Pension) దరఖాస్తు దారులకు అలెర్ట్‌. కొత్తగా పెన్షన్‌ అప్లయ్‌ చేసుకోవాలనుకునే వారి గడువు మంగ‌ళ‌వారంతో (సెప్టెంబర్ 15) ముగియనుంది.

G

Telangana | Published On Sep 15, 2026, 10.06 am IST

Cheyutha Pension | చేయూత‌ పెన్ష‌న్.. నేటితో ముగియ‌నున్న‌ ద‌ర‌ఖాస్తులు
Advertisement

Cheyutha Pension | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో చేయూత పెన్షన్ల ((Cheyutha Pension) దరఖాస్తు దారులకు అలెర్ట్‌. కొత్తగా పెన్షన్‌ అప్లయ్‌ చేసుకోవాలనుకునే వారి గడువు మంగ‌ళ‌వారంతో (సెప్టెంబర్ 15) ముగియనుంది. అర్హులైనవారు ఇప్ప‌టికీ దరఖాస్తు చేసుకోన‌ట్ల‌యితే, మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వం సూచించింది. ఈ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు సుమారు 4 లక్షల 80 వేల‌కు పైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. గ‌డువు ముగుస్తుండ‌టంతో ఆ సంఖ్య మ‌రింత పెరుగ‌నుంది.

కాగా, వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 25 నాటికి క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరు వరకు అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇండ్ల‌కు వెళ్లి అర్హతలను పరిశీలించ‌నున్నారు. అనంత‌రం అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. గ్రామాల్లో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో బిల్ క‌లెక్ట‌ర్లు క్షేత్ర‌స్థాయిలో ప‌రీశీలన చేప‌ట్టి ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

రాష్ట్రంలో 2.50 ల‌క్ష‌ల మందికి కొత్త పెన్ష‌న్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం ఆగ‌స్టు 9 నుంచి 5 కేట‌గిరిల్లో ద‌రఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్న‌ది. ద‌ర‌ఖాస్తుల‌కు గ‌డువు ఆగ‌స్టు 31నే ముగిసింది. అయితే గడువును మరో 15 రోజులపాటు పొడిగించింది.

 

Advertisement
Advertisement