త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధంతోపాటు అమెరికా బాండ్ ఈల్డ్స్ పెర‌గ‌డం ఈక్విటీ మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. ఈ కార‌ణంగా దేశీయ సూచీల‌తోపాటు ఆసియా మార్కెట్లు సైతం భారీ న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే బాండ్ ఈల్డ్స్ పెరిగితే ఆటోమేటిగ్గా డాల‌ర్ విలువ పెరుగుతుంది క‌నుక బంగారంపై కూడా ప్ర‌భావం ప‌డుతుంది.

S

Business | Published On Sep 15, 2026, 11.43 am IST

Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధంతోపాటు అమెరికా బాండ్ ఈల్డ్స్ పెర‌గ‌డం ఈక్విటీ మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. ఈ కార‌ణంగా దేశీయ సూచీల‌తోపాటు ఆసియా మార్కెట్లు సైతం భారీ న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే బాండ్ ఈల్డ్స్ పెరిగితే ఆటోమేటిగ్గా డాల‌ర్ విలువ పెరుగుతుంది క‌నుక బంగారంపై కూడా ప్ర‌భావం ప‌డుతుంది. ఈ కార‌ణంగానే మంగ‌ళ‌వారం బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.19 శాతం మేర త‌గ్గి 4,290 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.13 శాతం క్షీణించి 63 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 475 పాయింట్లు త‌గ్గి 1,50,755 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1275 పాయింట్లు ప‌త‌న‌మై 2,31,415 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర ఒక్క రోజే రూ.9వేల‌కు పైగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,317 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,22, 536 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,53,170 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,31,700 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.9,200 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,040 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,12,320గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,40,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,04,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,488 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.91,904గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,14,880 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,48,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,900 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500 గా ఉంది.

Advertisement
Advertisement