త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌లకు లీగల్‌ నోటీసులు పంపిన కేటీఆర్‌

KTR | కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు లీగల్‌ నోటీసులు పంపారు. తనపై, కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరికి వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు.

P

Telangana | Published On Jan 24, 2026, 9.25 pm IST

KTR | కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌లకు లీగల్‌ నోటీసులు పంపిన కేటీఆర్‌
Advertisement

KTR | కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు లీగల్‌ నోటీసులు పంపారు. తనపై, కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరికి వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన ఇద్దరు నేతలు వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశం పూర్వకంగా, రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ.. చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారంటూ ఈ మేరకు న్యాయవాదులతో కేటీఆర్‌ నోటీసులు పంపారు.

బండి సంజయ్‌కు పంపిన నోటీసులో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేలకోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్లీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు. మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు.

డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు కృషి చేసిన నేత అని.. అలాంటి వ్యక్తిపై సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని న్యాయవాదులు నోటీసులో వివరించారు. వెంటనే ఇద్దరు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోటీసు అందిన ఐదురోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్‌, క్రిమినల్‌ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement