త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | మైలార్‌దేవ్‌ప‌ల్లిలో విషాదం.. వేడి నీళ్ల బ‌కెట్‌లో ప‌డి నాలుగేండ్ల చిన్నారి మృతి

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని (Hyderabad) మైలార్‌దేవ్‌పల్లి ప్రగతినగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలుగేండ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ వేడి నీళ్ల బకెట్‌లో పడి మృతి చెందింది.

G

Hyderabad | Published On Sep 11, 2026, 11.46 am IST

Hyderabad | మైలార్‌దేవ్‌ప‌ల్లిలో విషాదం.. వేడి నీళ్ల బ‌కెట్‌లో ప‌డి నాలుగేండ్ల చిన్నారి మృతి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని (Hyderabad) మైలార్‌దేవ్‌పల్లి ప్రగతినగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలుగేండ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ వేడి నీళ్ల బకెట్‌లో పడి మృతి చెందింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు (Mahabubnagar) చెందిన కుటుంబం ఉపాధి కోసం గ‌త‌కొత‌కాలంగా ప్ర‌గ‌తిన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న‌ది. వారికి మాన‌స (4) కూతురు ఉంది. స్నానం చేసేందుకు ఆమె తల్లి వాటర్ హీటర్‌తో (Water Heater) బకెట్‌లో నీళ్లు వేడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమెకు ఫోన్ రావడంతో బయటకు వెళ్లారు.

అదే సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ వేడి నీళ్ల బకెట్‌లో పడిపోయింది. దీంతో చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు మానసను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement