PM Modi | మంచివాళ్లతోనే స్నేహం చేయాలి.. బ్రిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
PM Modi | 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో వివిధ కీలక అంశాలపై సానుకూల, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని (positive and meaningful discussions) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు (BRICS Summit) శని, ఆదివారాల్లో జరుగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. పలువురు దేశాధినేతలు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ఈ రెండు రోజుల సదస్సులో వివిధ కీలక అంశాలపై సానుకూల, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని (positive and meaningful discussions) పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
"రాబోయే రెండు రోజుల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నేతలు భారత్‌లో పర్యటిస్తారు. ప్రపంచ శ్రేయస్సే ధ్యేయంగా ఈ సదస్సులో వివిధ అంశాలపై సార్థకమైన చర్చలు జరుగుతాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. సద్గుణాలు కలిగిన వారితోనే మాట్లాడాలి. వారితోనే కలిపి పనిచేయాలి. వారితోనే చర్చలు, స్నేహం కొనసాగించాలి. దుర్గుణాలు కలిగిన వారితో మాత్రం ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు. వారికి దూరంగా ఉండాలి" అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ ఏడాది భారత్ అధ్యక్షతన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ''బలమైన భవిష్యత్తు కోసం స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత'' అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరగనుంది. సెప్టెంబరు 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండోనేషియా సహా మొత్తం 11 సభ్య దేశాలు ఉన్నాయి.
ఇక భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో ఆహారం, ఇంధనం, ఆరోగ్యం, విపత్తు నిర్వహణ, కీలక సరఫరా గొలుసుల్లో సామూహిక బలాన్ని, పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టిసారించనున్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాలో ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న సుంకాల విధానాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ సదస్సుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
కీలక అంశాలపై మోదీ-పుతిన్ చర్చలు
ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచంలోని పలు దేశాల అగ్రనేతలు భారత్‌కు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. మధ్యాహ్నం ప్రధాని మోదీ (PM Modi), అధ్యక్షుడు పుతిన్ మధ్య సమగ్ర ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా.. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, రక్షణ రంగాల్లో సహకారంపై దృష్టి సారిస్తారు. టెక్నాలజీ, ఔషధ రంగాలు (ఫార్మాస్యూటికల్స్), వ్యూహాత్మక వాణిజ్య స్థిరత్వం, సరిహద్దు చెల్లింపుల విధానాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.
జిన్‌పింగ్ కూడా..
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సైతం భారత పర్యటనకు రానున్నారు. 2019 తర్వాత ఆయన భారత్‌కు రానుండటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమవనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు, ఇతర ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక బ్రిక్స్ సమావేశానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian), దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa), ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాం, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్‌దెల్ ఫతా ఎల్ సిసి, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మహమద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్, ఇథియోఫియా ప్రధాని అబియ్ అహ్మద్ అలి, వియత్నామ్ ప్రధాని లీ మిన్ హుంగ్ తదితరులు హాజరుకానున్నారు.
Also Read..
భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ
స్టాక్ మార్కెట్ క్యాండిల్స్‌లో ఇంత కథ ఉందా? పచ్చ, ఎరుపు వెనుక సీక్రెట్ ఇదే..
యాపిల్ హెల్త్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ఇక ఆరోగ్యంపై మరింత నిఘా..
తాజావార్తలు
- ●Apple Health App | యాపిల్ హెల్త్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ఇక ఆరోగ్యంపై మరింత నిఘా..
- ●Palvai Harish Babu | రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా.. కనీసం 15 వేల ఉద్యోగాలు కూడా లేవు: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
- ●పచ్చ.. ఎర్ర? క్యాండిల్ రంగుల వెనుక అసలు కథ ఇదే.. ఎన్ని రకాల క్యాండిల్స్ ఉన్నాయో తెలుసా?
- ●Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్..
- ●Gachibowli | గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో వ్యక్తి దారుణ హత్య..
- ●SSC CPO Recruitment | డిగ్రీ అర్హతతో ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్లో 1871 ఎస్ఐ ఉద్యోగాలు

Apple Health App | యాపిల్ హెల్త్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ఇక ఆరోగ్యంపై మరింత నిఘా..

Palvai Harish Babu | రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా.. కనీసం 15 వేల ఉద్యోగాలు కూడా లేవు: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్

పచ్చ.. ఎర్ర? క్యాండిల్ రంగుల వెనుక అసలు కథ ఇదే.. ఎన్ని రకాల క్యాండిల్స్ ఉన్నాయో తెలుసా?

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్..






