త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Palvai Harish Babu | రూ.1.50 ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తున్నా.. క‌నీసం 15 వేల ఉద్యోగాలు కూడా లేవు: ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీశ్

Palvai Harish Babu | డాటా సెంట‌ర్ల (Data Centers) వ‌ల్ల రాష్ట్రానికి పెద్ద‌గా ఒరిగేదేమీ లేద‌ని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీశ్ (Palvai Harish Babu) అన్నారు. ల‌క్ష‌ల కోట్ల‌లో పెట్టుబులు వ‌స్తున్నా.. ఆశించిన మేర ఉద్యోగాల క‌ల్ప‌న జ‌ర‌గ‌డం లేద‌ని చెప్పారు.

G

Telangana | Published On Sep 11, 2026, 11.01 am IST

Palvai Harish Babu | రూ.1.50 ల‌క్షల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తున్నా.. క‌నీసం 15 వేల ఉద్యోగాలు కూడా లేవు: ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీశ్
Advertisement

Palvai Harish Babu | త్రినేత్ర‌.న్యూస్‌: డాటా సెంట‌ర్ల (Data Centers) వ‌ల్ల రాష్ట్రానికి పెద్ద‌గా ఒరిగేదేమీ లేద‌ని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీశ్ (Palvai Harish Babu) అన్నారు. ల‌క్ష‌ల కోట్ల‌లో పెట్టుబులు వ‌స్తున్నా.. ఆశించిన మేర ఉద్యోగాల క‌ల్ప‌న జ‌ర‌గ‌డం లేద‌ని చెప్పారు. తెలంగాణ‌లో టీసీఎస్ హైప‌ర్‌వాల్ట్‌, ఫార్చ్యూన్ కంపెనీలు రూ.1.50 ల‌క్షల కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ 10 వేల నుంచి 15 వేల ఉద్యోగాలు కూడా కొత్త‌గా రావ‌డం లేద‌న్నారు. ఇక హైద‌రాబాద్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్లు త‌గ్గిపోయాయ‌ని, వేలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నార‌ని తెలిపారు. శాస‌న స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఐటీ రంగ‌లో ఉద్యోగాలు, క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్ల‌పై స‌భ్యులు ప‌లు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. ఈ సంద‌ర్భంగా పాల్వాయి హ‌రీశ్ మాట్లాడుతూ..

`హైద‌రాబాద్‌లో ఐటీ భూమ్ ప్రారంభ‌మై 30 ఏండ్లు కావస్తున్న‌ది. 1996 నుంచి 2026 వ‌ర‌కు గ‌త 30 ఏండ్ల‌లో ఐటీ ఉద్యోగార్ధుల‌కు ప్ర‌స్తుతం క్లిష్ట ప‌రిస్థితులు ఉన్నాయ‌. ఐటీ ఉద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్ర‌తి ఏడాది వేల సంఖ్య‌లో ఇంజినీరింగ్ ప‌ట్ట‌భ‌ద్రులు కాలేజీల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వాస్త‌వానికి వారంతా ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందాలి. ఈ ఏడాది క్యాప‌స్ రిక్రూట్‌మెంట్‌లో (Campus Recruitment) 86 శాతం మందికి ప్లేస్‌మెంట్లు రాలేదు. చిన్న‌చిన్న ఇంజినీరింగ్ కాలేజీలే కాదు (Engineering Colleges).. టాప్ 10 కాలేజీల్లోనూ విద్యార్థుల‌కు ఉద్యోగాలు ద‌క్క‌లేదు. హైద‌రాబాద్‌లోని ఇంజినీరింగ్ కాలేజీలే కాదు.. ఐఐటీ కాలేజీ విద్యార్థుల‌కు కూడా ఈ ఏడాది క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ల‌లో ఉద్యోగాలు రాలేదు. ఐఐటీ విద్యార్థుల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్లి అలాట్‌మెంట్ ఆర్డ‌ర్లు ఇచ్చి.. వాటిని వెన‌క్కి తీసుకున్న వందలాది కంపెనీల‌ను ఆల్ ఐఐటీస్ ప్లేస్‌మెంట్ క‌మిటీ (AIPC) బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్న‌ట్లు హెచ్చ‌రించింది.

బ‌తుకుదెరువు లేద‌నే భ‌యంతో..

అమెరికాలో కూడా జాబ్ మార్కెట్ తీవ్ర ఇబ్బందుల్లో ఉంద‌న్నారు. వీసా ఇబ్బందుల నేప‌థ్యంలో చాలా మంది అమెరికాలోనే పెండ్లిళ్లు చేసుకుంటున్నారు. త‌ల్లిదండ్రులు చ‌నిపోయినా అంతిక సంస్కారాలు చేసేందుకు ఇక్క‌డికి రావ‌డం లేదు. వీడియోల్లోనే చూడాల్సి వ‌స్తుంది. మ‌న ద‌గ్గ‌ర ఉద్యోగాలు దొరుకుతాయ‌నే న‌మ్మకం ఉంటే వారు దేశానికి తిరిగి వ‌చ్చేవారు. ఇక్క‌డికి బ‌తుకుదెరువు లేద‌నే భ‌యంతో రావ‌డం లేదు. అందువ‌ల్ల‌ ఉద్యోగాల క‌ల్ప‌న అనేది మ‌న ప్ర‌ధాన ధ్యేయం కావాలి. మ‌నం మొత్తం స‌ర్వీస్ సెక్టార్‌పైనే ఆధార‌ప‌డ్డామ‌ని, త‌యారీ రంగాన్ని నిర్ల‌క్ష్యం చేశాం. ఇప్పుడు మాన్యుఫ్యాక్చ‌ర్ సెక్టార్ లేదు.. ఐటీ సెక్టార్ కూడా పూర్తిగా కునారిల్లుతున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌నం యువ‌త‌కు ఏం స‌మాధానం చెప్పాలో ఆలోచ‌న చేయాలి.

ఐటీ ట‌వ‌ర్ల‌లో వ‌డ్లు ఎండ‌బోస్తున్న‌రు..

సిద్దిపేట‌లోని (Siddipet) ఐటీ ట‌వ‌ర్‌లో రైతులు వడ్లు ఎండ‌బోసుకుంటున్న‌రు. రూ.52 కోట్ల‌తో క‌ట్టిన ఐటీ ట‌వ‌ర్‌లో ఉద్యోగాల క‌ల్ప‌న లేకపోవ‌డంతో రైతులు దానిని ఉప‌యోగించుకున్నారు. చాలా ద‌య‌నీయం. క‌రీంన‌గ‌ర్‌లో కూడా అలాంటి ప‌రిస్థితే ఉంది. ఇలా నేల విడిచి సాముచేస్తే మంచికాదు. క‌నీసం ఐటీఈఎస్ (ఐటీ ఎనేబుల్డ్ స‌ర్వీసెస్‌) లేదా బీపీఓ స‌ర్వీసుల‌ను జిల్లాల్లోని ఐటీ ట‌వ‌ర్ల‌లో ఏర్పాటు చేయాలి. కాల్ సెంట‌ర్లు న‌డిపేవారు కూడా హైద‌రాబాద్‌కే వ‌స్తున్న‌రు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, సిద్దిపేట వంటి పెద్ద టౌన్‌ల‌కు కూడా ఐటీ సెక్టార్‌ను ఎందుకు తీసుకుపోలేక‌పోతున్నాం?. క‌నీసం ఐటీఈఎస్‌, బీపీఓల‌ను కూడా టౌన్‌ల‌కు తీసుకుపోలేక‌పోతే మ‌నం నేల విడిచి సాము చేసిన‌ట్లే!. ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో సంబంధిత మంత్రి చొర‌వ తీసుకోవాలి.

పేరుకే ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులు..

టీసీఎస్ హైప‌ర్‌వాల్ట్ (TCS Hypervault) రూ.70 వేల‌ కోట్లతో 1 గిగావాట్ సామ‌ర్థ్యంతో 264 ఎక‌రాల్లో పెద్ద‌ డాటా సెంట‌ర్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఉద్యోగాలు వ‌స్తున్న‌ది మాత్రం 5 వేల‌ నుంచి 7 వేలు మాత్ర‌మే. డేటా సెంట‌ర్ల గురించి ప్ర‌పంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. 24 గంట‌ల పాటు క‌రెంటు, నీళ్లు వినియోగిస్తాయి. నీళ్ల కొత‌ర ఉన్న మ‌న రాష్ట్రానికి డాటా సెంట‌ర్ల వ‌ల్ల ఏం ఉప‌యోగం?. అభివృద్ధి చెందుతున్న భార‌త్ లాంటి దేశాలు డేటా సెంట‌ర్ల‌పై ఆధార‌ప‌డం ఎందుకు?. ఫార్చూన్ కూడా తెలంగాణ‌లో డాటా సెంట‌ర్ ఏర్పాటు చేయ‌డానికి ముందుకు వ‌స్తున్న‌ది. ఈ రెండు కంపెనీలు క‌లిపితే రాష్ట్రానికి రూ.1.50 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఉద్యోగాలు మాత్రం 10 వేల నుంచి 15 వేలు కూడా వ‌స్త‌లేవు. డాటా సెంట‌ర్ల వ‌ల్ల ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగ‌దు. అందువ‌ల్ల ఐటీ స‌ర్వీసులు, ఐటీఈఎస్ వ‌ల్ల‌నే ఉద్యోగాల క‌ల‌ప్ప‌న జ‌రుగుతుంది.` అని చెప్పారు.

టైర్‌-2 సిటీల్లోని ఐటీ టవర్లలో సంస్థల ఏర్పాటుకు ముందుకు రావట్లే: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఐటీ సంస్థల ఆసక్తి చూపిస్తున్నాయని ఆ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. టైర్‌-2 సిటీల్లోని ఐటీ టవర్లలో సంస్థల ఏర్పాటుకు ముందుకు రావట్లేదన్నారు. జిల్లాల్లోని ఐటీ టవర్ల సమీపంలో మౌలిక వసతులపై ఆలోచిస్తున్నారని తెలిపారు.

Advertisement
Advertisement