Mahesh Kumar Goud | భస్మాసురుడికి కజిన్ బ్రదర్ కేటీఆర్.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్
Mahesh Kumar Goud | కేటీఆర్ (KTR) వ్యాఖ్యలకు టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భస్మాసురుడికి కజిన్ బ్రదర్ కేటీఆర్ అని, అహంకారం పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. నిరుద్యోగుల ఉసురు తగలడం వల్లే బీఆర్ఎస్ (BRS)కు ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్: భస్మాసురుడికి కజిన్ బ్రదర్ కేటీఆర్ (KTR) అని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మండిపడ్డారు. ఆయనలో అహంకారం పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ (Telangana)ను భ్రష్టు పట్టించిన భ్రష్టాసుర సైన్యం బీఆర్ఎస్ (BRS) నేతలదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల ఉసురు తగలడం వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధితో 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చామని చెప్పారు. ఉరి తీయడం అంటే.. తప్పు చేసిన వారికి శిక్ష వేయడమని అన్నారు. ఎన్నో ఆశలతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురి చేసిందని, అందుకే వారిని శిక్షించాలని చెప్పారు.
కాంగ్రెస్ రెండేళ్ల ప్రజా పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి దిశలో సాగుతోందని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించి ప్రజాదరణ పొందిందని చెప్పారు. కాంగ్రెస్ చేసిన రైతు రుణ మాఫీ, రైతు భరోసా, మహిళలకు ఫ్రీ బస్, ఉచిత కరెంట్, సబ్సిడి గ్యాస్, సన్నబియం వంటి సంక్షేమ పథకాలు బీఆర్ఎస్, కేటీఆర్‌లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రికార్డ్ స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చిన విషయం ఏమైందన్నారు. 'బడుగు బలహీన వర్గాల కోసం కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు చేసినందుకు మమ్మల్ని శిక్షించాలా? లేకపోతే బీసీలకు మోసం చేసిన మిమ్మల్ని శిక్షించాలా?' చెప్పాలని సూచించారు. ఇప్పటికే కాళేశ్వరం అవినీతితో ప్రజలతో ఛీకొట్టించుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టులో వారి బాగోతం బయటపడుతుందని భయంతో అసెంబ్లీ నుంచి పారిపోయారని ఆరోపించారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేటీఆర్ ముందుగా తన చెల్లె కవిత వేస్తున్న ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇవ్వాలని హితవు పలికారు. తరువాత కాంగ్రెస్ గురించి మాట్లాడాలని అన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్ఎస్‌ను ప్రజలు అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ ఎన్నికల్లో శిక్షించారని, అయినా వారు మారడం లేదని ఎద్దేవా చేశారు. ఎవరిని ఉరి తీయాలో ప్రజలు ఇప్పటికీ పలు ఎన్నికల్లో నిరూపించారని, ఇప్పటికైనా వారు మారకపోతే ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



