త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కేటీఆర్‌ గారూ.. మీ ఆలోచనలను మాతో పంచుకోండి

P

Telangana | Published On Jan 13, 2026, 8.15 pm IST

KTR | కేటీఆర్‌ గారూ.. మీ ఆలోచనలను మాతో పంచుకోండి

సంక్షిప్త సారాంశం

న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ (CBS)లో ఏప్రిల్ 4న జరగనున్న 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (IBC)లో ప్రసంగించాలని కేటీఆర్‌కు ...ఆ సదస్సును నిర్వహించే విద్యార్థి విభాగం సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్ (SABA) ఆహ్వానం పంపింది.

Advertisement

KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఆహ్వానం లభించింది. మంత్రిగా అసాధారణ చేసిన కృషిని, తెలంగాణను ప్రపంచపటంలో సమున్నత స్థాయిలో నిలిపిన తీరును గుర్తిస్తూ అంతర్జాతీయ వేదికలపై ఆలోచనలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానం అందింది. సాంకేతికత, పాలన, సుస్థిర అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై ఆయనకున్న లోతైన అవగాహన ప్రపంచవ్యాప్తంగా విద్యా, విధాన నిర్ణేత, వ్యాపార వేదికలపై బలమైన ముద్ర వేసింది.

న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ (CBS)లో ఏప్రిల్ 4న జరగనున్న 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (IBC)లో ప్రసంగించాలని కేటీఆర్‌కు సదస్సును నిర్వహించే విద్యార్థి విభాగం సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్ (SABA) ఆహ్వానం పంపింది. భారతదేశ వ్యాపార, ఆవిష్కరణ, విధాన నిర్ణయ రంగాలపై మేధోమథనం జరిగే ప్రపంచంలోని అత్యున్నత వేదికలలో 'ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్' ఒకటి.

గత 21 ఏళ్లుగా న్యూయార్క్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం పోషిస్తున్న పాత్రపై చర్చించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రవాస భారతీయులకు ఓ వేదికగా నిలుస్తోంది. 2026 ఎడిషన్ కాన్ఫరెన్స్‌లో 'జెరోధా' వ్యవస్థాపకులు నిఖిల్ కామత్ ప్రధాన వక్తగా వ్యవహరించనున్నారు. గతంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, డ్రీమ్ 11 సహ వ్యవస్థాపకులు హర్ష్ జైన్ త‌దిత‌ర ప్రముఖులు ఈ వేదికపై ప్రసంగించారు. ఇటీవ‌ల కేటీఆర్‌కు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల‌ని ఆహ్వానం వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement