త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జిలను నియమించిన కేటీఆర్‌.. ఎవ‌రు ఎక్క‌డంటే?

BRS | రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు (Municipal Elections) మ‌రో రెండు మూడు రోజుల్లో నోటిఫికేష‌న్ రానుంది. దీంతో పుర పోరుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల వారిగా ప్ర‌త్యేక సమన్వయకర్తలను (Coordinators) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నియమించారు.

G

Telangana | Published On Jan 25, 2026, 6.22 am IST

BRS | మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జిలను నియమించిన కేటీఆర్‌.. ఎవ‌రు ఎక్క‌డంటే?
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు (Municipal Elections) మ‌రో రెండు మూడు రోజుల్లో నోటిఫికేష‌న్ రానుంది. దీంతో పుర పోరుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల వారిగా ప్ర‌త్యేక సమన్వయకర్తలను (Coordinators) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నియమించారు. మొత్తం 122 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఇన్‌చార్జిలను ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ సమన్వయకర్తల ప్రధాన బాధ్యత. ఎన్నికల ప్రక్రియ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ముగిసే వరకు వీరు నిరంతరం ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంటారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వీరు కీలక పాత్ర పోషించ‌నున్నారు. స్థానిక నాయకత్వంతో చర్చించి, గెలుపు గుర్రాలను గుర్తించి, నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పిస్తారు. అంతేకాకుండా, పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ లెవల్ ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను పర్యవేక్షిస్తారు.

ఎన్నికల సరళిని, గ్రౌండ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి, వర్కింగ్ ప్రెసిడెంట్‌కి నివేదించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈనేప‌థ్యంలో పార్టీ తరపున నియమితులైన‌ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తల జాబితాను కేటీఆర్ అధికారికంగా విడుదల చేశారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.

ఉమ్మ‌డి జిల్లాల వారీగా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు..

మెదక్ జిల్లా

మెదక్: ఫారూఖ్ హుస్సేన్
రామాయంపేట: మరెడ్డి రవీందర్ రెడ్డి
నారాయణఖేడ్: జైపాల్ రెడ్డి
ఆందోల్-జోగిపేట: నరహరి రెడ్డి
నర్సాపూర్: వెంకట్ రామ్ రెడ్డి
జహీరాబాద్: దేవీ ప్రసాద్
కోహీర్: ఎం.ఏ. హకీమ్
సంగారెడ్డి: కడవెర్గు రాజనర్సు
సదాశివపేట: సపాన్ దేవ్ మరియు బిక్షపతి
జిన్నారం: పాల సాయిరాం
గుమ్మడిదల: మాణిక్యం
గడ్డపోతారం: శంభీపూర్ రాజు
ఇంద్రేషం: గోసుల శ్రీనివాస్ యాదవ్
ఇస్నాపూర్: ఎర్రోళ్ల శ్రీనివాస్
దుబ్బాక: గుండు భూపేష్
గజ్వేల్: వి. రాధాకృష్ణ శర్మ
తూప్రాన్: మాచా వేణుగోపాల్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా

కాగజ్‌నగర్: డా. దాసోజు శ్రవణ్
చెన్నూర్: తిప్పని లింగయ్య
క్యాతన్‌పల్లి: పల్లె భూమేష్
బెల్లంపల్లి: నగేష్ ముదిరాజ్
మంచిర్యాల కార్పొరేషన్: తొంగుల సత్యనారాయణ / మెడిపల్లి సంపత్
లక్సెట్టిపేట: శ్రీనివాస్ రావు
ఆసిఫాబాద్: డా. దాసోజు శ్రవణ్
ఖానాపూర్: మహమ్మద్ అబ్దుల్ ముజీబ్
ఆదిలాబాద్: రాథోడ్ జనార్దన్
నిర్మల్: అనిల్ జాధవ్
భైంసా: జక్కా వెంకట్ రెడ్డి

నల్ల‌గొండ‌ జిల్లా

నందికొండ: గుజ్జ యుగేందర్ రావు
హాలియా: తిప్పన విజయసింహ రెడ్డి
దేవరకొండ: పల్వాయి శ్రవంతి
మిర్యాలగూడ: బడుగుల లింగయ్య
హుజూర్ నగర్: కంచర్ల కృష్ణారెడ్డి
నేరేడుచర్ల: రేగట్టే మల్లికార్జున రెడ్డి
కోదాడ: బుడిద భిక్షమయ్య గౌడ్
సూర్యాపేట: రాంచందర్ నాయక్
నల్ల‌గొండ‌: ఎంసీ. కోటి రెడ్డి
చౌటుప్పల్: చింతాల వెంకటేశ్వర్ రెడ్డి
చండూరు: జీ. వెంకట నారాయణ గౌడ్
పోచంపల్లి: నంద్యాల దయాకర్ రెడ్డి
భువనగిరి: బండ నరేందర్ రెడ్డి
చిట్యాల: చడ కిషన్ రెడ్డి
మోత్కూర్: ధర్మేందర్ రెడ్డి
తిరుమలగిరి: ఎలగండ్ల వెంకటేశ్వర్ రావు
యాదగిరిగుట్ట: లక్ష్మారెడ్డి
ఆలేరు: లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్ జిల్లా

కొడంగల్: గట్టు రామచందర్ రావు
కోస్గి: ఇంతియాజ్ అహ్మద్
మద్దూరు: కరేటే రాజు
నారాయణపేట: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
మహబూబ్‌నగర్ కార్పొరేషన్: నవీన్ రెడ్డి
భూత్పూర్: లక్ష్మారెడ్డి
దేవరకద్ర: పల్లె రవి
కొత్తకోట: పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి
గద్వాల: ఆంజనేయ గౌడ్
ఐజ: చల్లా వెంకట్ రామిరెడ్డి
నాగర్‌కర్నూల్: మాధవరం కృష్ణారావు
షాద్ నగర్: బైకాని శ్రీనివాస్ యాదవ్
కల్వకుర్తి: రాజీవ్ సాగర్
అమంగల్: రజిని సాయిచందు
కొల్లాపూర్: ఉప్పల వెంకటేష్ గుప్తా
మక్తల్: దుడిమెట్ల బాలరాజ్ యాదవ్
అమరచింత: కిషోర్ గౌడ్ / ఉపేందర్ చారి
ఆత్మకూర్: ముదావత్ రాంబాల్ నాయక్
పెబ్బేరు: రాజవర ప్రసాద్
వనపర్తి: రంగినేని అభిలాష్ రావు

వరంగల్ జిల్లా

జనగామ: క్యామ మల్లేష్
చేర్యాల: ఎల్లు రవీందర్ రెడ్డి
స్టేషన్ ఘన్‌పూర్: పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
తొర్రూర్: మర్రి యాదవ రెడ్డి
డోర్నకల్: మెట్టు శ్రీనివాస్
మరిపెడ: అనుగుల రాకేష్ రెడ్డి
మహబూబాబాద్: దాస్యం వినయ్ భాస్కర్
కేసముద్రం: వై. సతీష్ రెడ్డి
నర్సంపేట: నన్నపునేని నరేందర్
పరకాల: వాసుదేవ రెడ్డి
వర్ధన్నపేట: నాగుర్ల వెంకన్న
భూపాలపల్లి: బండ ప్రకాష్
ములుగు: సత్యవతి రాథోడ్

రంగారెడ్డి జిల్లా (ఉమ్మడి)

అలియాబాద్: మన్నె కృష్ణాంక్
ఎల్లంపేట: వెంకట్ రెడ్డి
ముదిచింతలపల్లి: గజ్జెల నాగేష్
ఇబ్రహీంపట్నం: నందికంటి శ్రీధర్
చేవెళ్ల: పీ. కార్తీక్ రెడ్డి
శంకర్‌పల్లి: కసాని వీరేష్ ముదిరాజ్
మొయినాబాద్: ముఠా జైసింహ / అమృత్‌లాల్ చౌహాన్
పరిగి: ఎం.ఎన్. శ్రీనివాస్
వికారాబాద్: మధుసూధన చారి
తాండూరు: శ్రీశైల్ రెడ్డి పంజుగుల

నిజామాబాద్

ఆర్మూర్: చెరుముల్ల రాకేష్
భీమ్ గల్: గడ్డం సుమన రెడ్డి
బోధన్: డీ. విఠల్ రావు
బాన్సువాడ: గిరిదావర్ గంగారెడ్డి
బిచ్కుంద: తానాజీ రావు
కామారెడ్డి: వీజీ. గౌడ్
ఎల్లారెడ్డి: దఫేదార్ రాజు
నిజామాబాద్ కార్పొరేషన్: కేఆర్. సురేష్ రెడ్డి

కరీంనగర్ జిల్లా

కోరుట్ల: చగళ్ల నరేందర్‌నాథ్
మెట్‌పల్లి: శ్రీకాంత్ రెడ్డి
జగిత్యాల: విద్యా సాగర్ రావు
రాయికల్: విద్యా సాగర్ రావు
ధర్మపురి: రఘువీర్ సింగ్
రామగుండం కార్పొరేషన్: కొప్పుల ఈశ్వర్
మంథని: ఈడ శంకర్ రెడ్డి
పెద్దపల్లి: లోక బాపు రెడ్డి
సుల్తానాబాద్: జి.వి. రామకృష్ణ రావు
కరీంనగర్ కార్పొరేషన్: బి. వినోద్ కుమార్
చొప్పదండి: గెల్లు శ్రీనివాస్ యాదవ్
వేములవాడ: గుడూరి ప్రవీణ్
సిరిసిల్ల: తుల ఉమ
హుజూరాబాద్: పన్యాల భూపతి రెడ్డి
జమ్మికుంట: సుధీర్ మరిపల్లి
హుస్నాబాద్: తక్కళ్లపల్లి రవీందర్ రావు

ఖమ్మం

ఇల్లందు: ఆర్ జేసీ. కృష్ణ
ఎదులాపురం: తాతా మధు
మధిర: నామ నాగేశ్వరరావు
వైరా: పువ్వాడ అజయ్ కుమార్
సత్తుపల్లి: కురుకుల నాగభూషణం
కల్లూరు: దిండిగళ్ల రాజేందర్
కొత్తగూడెం కార్పొరేషన్: వడ్డిరాజు రవిచంద్ర / రేగా కాంతారావు
అశ్వరావుపేట: ఉప్పల వెంకటరమణ

Advertisement

తాజావార్తలు

Advertisement