Telangana Assembly | అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి భోజనం
Telangana Assembly | అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్‌లో ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. శాసనసభలో నువ్వా నేనా అన్నట్టు ఉండే సభ్యులు.. బయటకు వచ్చిన తర్వాత సోదర స్వభావంతో కలిసిపోతారు. అసెంబ్లీ లాబీతో పాటు ఎల్పీ కార్యాలయాల్లో ఛలోక్తులు విసురుకుంటూ సరదాగా ఉంటారు.
Telangana Assembly | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్‌లో ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. శాసనసభలో నువ్వా నేనా అన్నట్టు ఉండే సభ్యులు.. బయటకు వచ్చిన తర్వాత సోదర స్వభావంతో కలిసిపోతారు. అసెంబ్లీ లాబీతో పాటు ఎల్పీ కార్యాలయాల్లో ఛలోక్తులు విసురుకుంటూ సరదాగా ఉంటారు. అలాంటి సన్నివేశమే మంగళవారం ఆవిష్కృతమైంది.
లంచ్ సమయంలో అసెంబ్లీలోని మెంబర్స్ లాంజ్‌లో.. కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్ కలిసి భోజనం చేశారు. భోజనం ముగించాక కూడా మెంబర్స్ లాంజ్‌లోనే ఆ ముగ్గురు సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించారు. సుమారు 2 గంటలకు పైగా ఈ ముగ్గురు సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.
భేటీకి ప్రాధాన్యత
కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడి ప్రత్యామ్నాయ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని బహిరంగంగానే హెచ్చరించారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మొత్తానికి వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



