త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Koppula Eshwar | 20 లోపే బీఆర్ఎస్‌లోకి జీవ‌న్ రెడ్డి : కొప్పుల ఈశ్వ‌ర్

Koppula Eshwar | ఈ నెల 20వ తేదీ లోపే జ‌గిత్యాల జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతార‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ తెలిపారు. జ‌గిత్యాల‌లో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి.. కేసీఆర్ స‌మ‌క్షంలో జీవ‌న్ రెడ్డి పార్టీలో చేరుతార‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On Apr 10, 2026, 7.32 pm IST

Koppula Eshwar | 20 లోపే బీఆర్ఎస్‌లోకి జీవ‌న్ రెడ్డి : కొప్పుల ఈశ్వ‌ర్
Advertisement

Koppula Eshwar | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 20వ తేదీ లోపే జ‌గిత్యాల జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతార‌ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ తెలిపారు. జ‌గిత్యాల‌లో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి.. కేసీఆర్ స‌మ‌క్షంలో జీవ‌న్ రెడ్డి పార్టీలో చేరుతార‌ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్లీన‌రీకి ముందే పార్టీలో చేరిక‌లు ఉంటాయ‌ని కొప్పుల ఈశ్వ‌ర్ స్ప‌ష్టం చేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో జ‌గిత్యాల సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మ‌ర్యాద‌పూర్వ‌కంగా స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌మ ఇద్ద‌రి మ‌ధ్య నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ఉన్న స్నేహాన్ని నెమ‌రేసుకున్నారు. అన్నా న‌న్ను దేవుడే పంపిండు.. మీతో క‌లిసి ప‌ని చేయ‌మ‌ని కేసీఆర్‌కు చెబుతూ జీవ‌న్ రెడ్డి భావోద్వేగానికి లోన‌య్యారు. కేసీఆర్ జీవ‌న్ రెడ్డిని ఆప్యాయంగా ప‌లుక‌రించారు. త‌ద‌నంత‌రం ఆలింగ‌నం చేసుకున్నారు.

ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. జీవన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలందించి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement