త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | న్యాయాన్ని అప‌హాస్యం చేసేలా ఎన్‌సీఎల్టీ తీరు..: కేటీఆర్‌

KTR | సాధ‌ర‌ణ ప్ర‌జ‌లు, రైతులు అయినా, చిన్న వ్యాపార‌వేత్త అయినా లేదా ఈఎంఐలు (EMI) చెల్లించే స‌గ‌టు ఉద్యోగి అయినా.. లోన్ క‌ట్ట‌క‌పోతే వారిని డీఫాల్ట‌ర్లుగా, ఎన్‌పీఏ (NPA)లుగా ముద్ర‌వేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు.

G

Telangana | Published On Aug 28, 2026, 9.36 am IST

KTR | న్యాయాన్ని అప‌హాస్యం చేసేలా ఎన్‌సీఎల్టీ తీరు..: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఒక్క‌ రూపాయి బాకీ ఉన్నా బ్యాంకులు వారిని వేధిస్తుంటాయి. వారి ఇండ్లు, ఆస్తుల‌ను వేలం వేస్తాయి. అదే కోట్ల‌లో ఎగ్గొట్టే వారిని అప్పుల‌ను మాత్రం మాఫీ చేస్తుంటాయి. ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ మ‌నం చూస్తూనే ఉంటాం. తాజాగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దీనిపై స్పందించారు.

సాధ‌ర‌ణ ప్ర‌జ‌లు, రైతులు అయినా, చిన్న వ్యాపార‌వేత్త అయినా లేదా ఈఎంఐలు (EMI) చెల్లించే స‌గ‌టు ఉద్యోగి అయినా.. లోన్ క‌ట్ట‌క‌పోతే వారిని డీఫాల్ట‌ర్లుగా, ఎన్‌పీఏ (NPA)లుగా ముద్ర‌వేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు. కానీ మ‌న దేశంలోని ధ‌న‌వంతులు, ప్ర‌భావ‌శీలురు మాత్రం ఏకంగా 99.97 శాతం రుణ‌మాఫీతో సుల‌భంగా త‌ప్పించుకుంటున్నారు. ఎన్‌సీఎల్టీ (NCLT) వ్యవహరిస్తున్న తీరు న్యాయాన్ని అపహాస్యం చేయడం కాదా? అన్నారు. దీనిపై ఎన్డీయే (NDA) ప్రభుత్వ నాయకత్వం వద్ద ఏమైనా సమాధానం ఉందా? అంటు ఎక్స్ వేదిక‌గా ప్ర‌శ్నించారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement