Konda Surekha Resignation | కొండా సురేఖ వ్యవహారం : మీరే చూసుకోండి.. అంతా భట్టికే వదిలేసిన హైకమాండ్
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. ఆమెను రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరిందా? ప్రజాభవన్‌లో భట్టి, కొండా మురళి భేటీ వెనుక అసలు కథ ఇదేనా?
- కొండా సురేఖ వ్యవహారాన్ని చక్కబెట్టే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్
- ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్కతో కొండా మురళి అత్యవసర భేటీ.
- మధ్యవర్తిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- సీఎం రేవంత్‌పై కొండా సుష్మిత కామెంట్లపై సీరియస్‌గా ఉన్న అధిష్ఠానం
- గౌరవప్రదంగా తప్పుకోవాలని సురేఖకు అధిష్ఠానం సూచించినట్లు ప్రచారం
Konda Surekha Resignation | రాష్ట్ర కాంగ్రెస్ (Telangana Congress) రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్.. మంత్రి కొండా సురేఖ వ్యవహారం. ఇటీవల ఆమె కూతురు సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసే బాధ్యతను కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) అప్పగించినట్లు సమాచారం.
ప్రజాభవన్‌లో హై టెన్షన్.. ఏంజరుగుతోంది?
బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ భర్త, సీనియర్ నేత కొండా మురళి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal reddy) కూడా పాల్గొనడం తీవ్ర ఆసక్తి రేపుతోంది. కాసేపటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో జాయిన్ అవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజగోపాల్ రెడ్డి రాయబారం..
కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా సయోధ్య కుదిర్చేందుకే కొండా మురళి ఈ భేటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఆయన చొరవతోనే కొండా మురళితో భట్టి మీటింగ్ ఏర్పాటైనట్లు సమాచారం.
గౌరవంగా తప్పుకోమన్నారా?
విశ్వసనీయ సమాచారం ప్రకారం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను గౌరవప్రదంగా పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్‌ను నేరుగా చెప్పకుండా.. సీనియర్ మంత్రైన భట్టి విక్రమార్క ద్వారా ఆమెకు చేరవేసినట్లు టాక్. ఒకట్రెండు రోజులు సమయం తీసుకుని రాజీనామా (Resignation) చేయాలని అధిష్ఠానం సూచించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మద్దతు కరువు.. ఖర్గే భేటీ విఫలం?
సీఎం రేవంత్‌పై సుష్మిత చేసిన కామెంట్లు ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర నష్టం చేశాయని అధిష్ఠానం భావిస్తోంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులు అధిష్ఠానానికి నివేదికలు పంపారు. ఆదివారం సురేఖ.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసినప్పటికీ, ఆమెకు అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన నేతగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఆమెకు మద్దతుగా నిలవలేదు.
Also Read : Konda Surekha Resignation | రాజీనామా చేయండి.. సురేఖకు హైకమాండ్ ఆదేశం
మా కూతురి వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూతురు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, 35 ఏళ్ల వయసున్న ఆమెకు తనకంటూ సొంత ఆలోచనలు, మనోభావాలు ఉంటాయని, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేరన్న వార్తలను ఖండించిన ఆయన, ఆమె వరంగల్‌లో తిరుగుతున్నారని తెలిపారు. భట్టి విక్రమార్కను తాను కేవలం బిల్లుల కోసం మాత్రమే కలిశానని, అక్కడ ఈ వివాదం ప్రస్తావన రాలేదని పేర్కొన్నారు. క్రమశిక్షణా కమిటీ నిర్ణయం వెలువడే వరకు తాను ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపిన మురళి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని, తాము నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ వివాదం తర్వాత అభిమానుల స్పందన ఎలా ఉందన్న ప్రశ్నకు.. తాను ఇంకా వరంగల్ వెళ్లలేదని ఆయన బదులిచ్చారు.
ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క, కొండా మురళికి ఏం చెప్పారు? కొండా మురళి.. భట్టికి ఏమని వివరణ ఇచ్చారు? అసలు మంత్రి కొండా సురేఖ నిర్ణయం ఏంటి? క్రమశిక్షణా కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిగ్ సస్పెన్స్‌గా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Konda Surekha Resignation | రాజీనామా చేయండి.. సురేఖకు హైకమాండ్ ఆదేశం
ఆగస్టు 24, 2026

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
ఆగస్టు 13, 2026

కర్ణాటక ‘పోటు’.. గాంధీభవన్‌లో ‘స్క్రిప్ట్’ మార్పు? రేవంత్ యూత్ ఫార్ములాపై ఏఐసీసీ లో సస్పెన్స్!
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Onam 2026 | ఓనం స్పెషల్.. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన తారలు
- ●Harish Rao | మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి
- ●TMC MPs | 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నోటీసులు
- ●IMA Advisory | దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు.. కీలక అడ్వైజరీ జారీ చేసిన ఐఎంఏ..!
- ●Kalvakuntla Kavitha | ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి పెళ్లి కూతురికి తాళి కట్టిన కల్వకుంట్ల కవిత
- ●boltt Ace 5G | స్మార్ట్‌ఫోన్ మేకింగ్‌లోకి బోల్ట్.. తొలి రెండు ఫోన్లు లాంచ్, ధర రూ.9,999 మాత్రమే..

Onam 2026 | ఓనం స్పెషల్.. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన తారలు

Harish Rao | మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి

TMC MPs | 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నోటీసులు

IMA Advisory | దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు.. కీలక అడ్వైజరీ జారీ చేసిన ఐఎంఏ..!



