త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vivo X500 | వివో ఎక్స్500 సిరీస్ లాంచ్.. 7,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 200 ఎంపీ కెమెరా..

Vivo X500 | వివో భారత మార్కెట్లో ఎక్స్500, ఎక్స్500 ప్రో, ఎక్స్500 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. జీస్ కెమెరాలు, 2ఎన్ఎం ప్రాసెసర్, 7,800 ఎంఏహెచ్ వరకు బ్యాటరీ సామర్థ్యం, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ సిరీస్ ప్రధాన ప్రత్యేకతలు. ఈ ఫోన్ల ప్రారంభ ధరను రూ.1,19,999గా నిర్ణయించింది. గురువారం నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కాగా, డిసెంబర్ 3 నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి.

S

Technology | Published On Nov 26, 2026, 5.58 pm IST

Vivo X500 | వివో ఎక్స్500 సిరీస్ లాంచ్.. 7,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 200 ఎంపీ కెమెరా..
Advertisement

Vivo X500 | వివో భారత మార్కెట్లో ఎక్స్500, ఎక్స్500 ప్రో, ఎక్స్500 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. జీస్ కెమెరాలు, 2ఎన్ఎం ప్రాసెసర్, 7,800 ఎంఏహెచ్ వరకు బ్యాటరీ సామర్థ్యం, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ సిరీస్ ప్రధాన ప్రత్యేకతలు. ఈ ఫోన్ల ప్రారంభ ధరను రూ.1,19,999గా నిర్ణయించింది. గురువారం నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కాగా, డిసెంబర్ 3 నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి.

ప‌వర్‌ఫుల్ కెమెరా సెట‌ప్‌..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారత మార్కెట్లో తన ఎక్స్500 సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రీమియం విభాగంలో ఎక్స్500 ప్రో మ్యాక్స్, మధ్యస్థ ప్రీమియం విభాగంలో ఎక్స్500 ప్రో, సాధారణ మోడల్‌గా ఎక్స్500 అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు ఫోన్లలోనూ జీస్ (ZEISS) భాగస్వామ్యంతో రూపొందించిన కెమెరా వ్యవస్థలు, బ్లూవోల్ట్ రెండో తరం సెమీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్500 ప్రో మ్యాక్స్‌లో 200 ఎంపీ జీస్ ఏపీఓ టెలిఫొటో కెమెరాను అందించారు. దీనికి అదనంగా 400 ఎంఎం సామర్థ్యంతో పనిచేసే జీస్ టెలిఫొటో ఎక్స్‌టెండర్ జనరేషన్ 2 అల్ట్రా సదుపాయం కూడా ఉంది. ఎక్స్500 ప్రోలో 64 ఎంపీ సెన్సార్‌తో కూడిన 85 ఎంఎం జీస్ ఏపీఓ టెలిఫొటో లెన్స్ ఉండగా, సాధారణ ఎక్స్500లో 72 ఎంఎం జీస్ ఏపీఓ టెలిఫొటో లెన్స్, 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉన్నాయి.

భారీ బ్యాట‌రీ..

వీడియో, ఫొటోగ్రఫీ కోసం ఈ సిరీస్‌లో ప్రత్యేక సదుపాయాలను తీసుకొచ్చారు. ఎక్స్500 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లలో ఎక్స్-ట్రాక్ ఇంజిన్ ద్వారా వేగంగా కదిలే వస్తువులను ఆటోఫోకస్‌తో ట్రాక్ చేయవచ్చు. ప్రో మ్యాక్స్‌లో సెకనుకు 60 ఫ్రేమ్‌ల వరకు ట్రాకింగ్, 30 రెట్లు లాంగ్-రేంజ్ మోషన్ స్నాప్‌షాట్ సదుపాయం ఉండగా, ప్రో మోడల్‌లో 20 రెట్ల వరకు ఈ సదుపాయం ఉంది. మూడు ఫోన్లలోనూ 4కే వీడియో రికార్డింగ్, 240 ఎఫ్‌పీఎస్ వరకు హైస్పీడ్ రికార్డింగ్, సినిమాటిక్ పోర్ట్రెయిట్ వీడియో, స్టేజ్ మోడ్ 3.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో 2ఎన్ఎం ప్రాసెసర్ ఉండగా, ఎక్స్500లో డైమెన్సిటీ 9600ఎం ప్రాసెసర్ అందించారు. బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే ఎక్స్500 ప్రో మ్యాక్స్‌లో 7,800 ఎంఏహెచ్, ఎక్స్500లో 7,500 ఎంఏహెచ్, ఎక్స్500 ప్రోలో 6,510 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి.

ఫాస్ట్ చార్జింగ్‌, వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌..

మూడు మోడళ్లలోనూ 90 వాట్స్ వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్, 40 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. డిస్‌ప్లేల విషయానికి వస్తే ఎక్స్500లో 6.59 ఇంచుల తెర, ఎక్స్500 ప్రోలో 6.36 ఇంచుల‌ తెర, ప్రో మ్యాక్స్‌లో 6.85 ఇంచుల 2కే డిస్‌ప్లేల‌ను అందించారు. మూడు మోడళ్లకు ఐపీ68, ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ 3.2 కనెక్టివిటీ ఉన్నాయి. ఆరిజిన్ ఓఎస్ 7 ద్వారా యాపిల్ ఎయిర్‌డ్రాప్‌కు అనుకూలమైన ఫైల్ షేరింగ్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటి పరికరాల నిర్వహణ, మ్యాక్ కంప్యూటర్లతో వివో ఆఫీస్ కిట్ అనుసంధానం వంటి సదుపాయాలను కూడా అందించారు.

ధ‌ర వివ‌రాలు..

12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కలిగిన వివో ఎక్స్500 ధరను రూ.1,19,999గా నిర్ణయించారు. ఎక్స్500 ప్రో 12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.1,49,999, ఎక్స్500 ప్రో మ్యాక్స్ 12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.1,64,999, 512జీబీ వేరియంట్ ధర రూ.1,79,999గా ఉన్నాయి. ఫొటోగ్రాఫర్ కిట్‌తో కూడిన ప్రో మ్యాక్స్ ధర రూ.2,29,999గా ఉంది. అదనంగా 200 ఎంఎం టెలిఫొటో ఎక్స్‌టెండర్ ధర రూ.15,999, 400 ఎంఎం ఎక్స్‌టెండర్ ధర రూ.27,999, ఇమేజింగ్ గ్రిప్ కిట్ ధర రూ.11,999గా ఉన్నాయి. గురువారం నుంచి వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 3 నుంచి విక్రయాలు జరగనున్నాయి.

కొనుగోలుదారులకు 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ, ఎంపిక చేసిన బ్యాంకులు, యూపీఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆఫర్లను కలిపి పొందడం సాధ్యం కాదు. వి-షీల్డ్ రక్షణ ప్లాన్లపై 40 శాతం వరకు తగ్గింపు, రూ.399 జియో రీఛార్జ్‌తో 12 నెలల కాన్వా ప్రో ఉచితం, గూగుల్ ఏఐ ప్రో మూడు నెలల ఉచిత సదుపాయం, 5 టీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా అందిస్తున్నారు. ఎక్స్500 సిరీస్ ఫోన్‌తో వివో వాచ్ జీటీ 2 కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది.

Advertisement
Advertisement