త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GST Registration | వ్యాపారుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక ఆన్‌లైన్‌లోనే సులభంగా జీఎస్టీ రద్దు..

GST Registration | కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెంట్రల్ జీఎస్టీ నిబంధనలు-2017లోని రూల్ 20కి సవరణలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు, పెండింగ్ రిటర్నులన్నింటినీ సమర్పించి, చెల్లించాల్సిన పన్నులు, వడ్డీ, ఫీజులు, జరిమానాలు ఇతర బకాయిలను పూర్తిగా చెల్లించినట్లయితే, జీఎస్టీ కామన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. దరఖాస్తులో కోరిన తేదీ నుంచే రద్దు అమల్లోకి వస్తుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఫామ్ జీఎస్టీ ఆర్‌ఈజీ-38 ద్వారా ఆన్‌లైన్‌లోనే తెలియజేస్తారు.

S

Business | Published On Nov 26, 2026, 6.15 pm IST

GST Registration | వ్యాపారుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక ఆన్‌లైన్‌లోనే సులభంగా జీఎస్టీ రద్దు..
Advertisement

GST Registration | కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెంట్రల్ జీఎస్టీ నిబంధనలు-2017లోని రూల్ 20కి సవరణలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు, పెండింగ్ రిటర్నులన్నింటినీ సమర్పించి, చెల్లించాల్సిన పన్నులు, వడ్డీ, ఫీజులు, జరిమానాలు ఇతర బకాయిలను పూర్తిగా చెల్లించినట్లయితే, జీఎస్టీ కామన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. దరఖాస్తులో కోరిన తేదీ నుంచే రద్దు అమల్లోకి వస్తుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఫామ్ జీఎస్టీ ఆర్‌ఈజీ-38 ద్వారా ఆన్‌లైన్‌లోనే తెలియజేస్తారు.

అయితే అన్ని దరఖాస్తులూ ఆటోమేటిక్‌గా ఆమోదం పొందవు. పెండింగ్ రిటర్నులు సమర్పించకపోయినా, ఫామ్ జీఎస్టీ సీఏంపీ-08 సమర్పించాల్సి ఉండి సమర్పించకపోయినా, పన్నులు లేదా ఇతర బకాయిలు చెల్లించకపోయినా సంబంధిత దరఖాస్తును జీఎస్టీ అధికారి పరిశీలనకు పంపిస్తారు. ఈ నిబంధనలతో అర్హత కలిగిన వ్యాపారులకు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది. రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియ వేగవంతం కావడంతోపాటు పారదర్శకత పెరగనుంది.

Advertisement
Advertisement