త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Rajagopal Reddy | ఒంటి గంట త‌ర్వాతే.. వైన్సుల‌ సమయాల్లో మార్పు ఉండదు.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Komatireddy Rajagopal Reddy | మునుగోడు (Munugode) నియోజకవర్గంలో మ‌ద్య దుకాణాల (Wine Shops) సమయాల్లో ఎలాంటి మార్పూ ఉండదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) స్ప‌ష్టం చేశారు.

G

Telangana | Published On Jan 19, 2026, 10.50 am IST

Komatireddy Rajagopal Reddy | ఒంటి గంట త‌ర్వాతే.. వైన్సుల‌ సమయాల్లో మార్పు ఉండదు.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మునుగోడు (Munugode) నియోజకవర్గంలో మ‌ద్య దుకాణాల (Wine Shops) సమయాల్లో ఎలాంటి మార్పూ ఉండదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్సులు ఉద‌యం 10 గంట‌ల‌కు తెరచుకుంటాయి. అయితే మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఓపెన్ అవుతాయి. అయితే స‌మయాల్లో మార్పు చేయాల‌ని కోరుతూ మ‌ద్యం వ్యాపారులు ఎమ్మెల్యేను క‌లిశారు. ఈ సంద‌ర్‌భంగా వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యం పాడుచేయొద్దని వారికి సూచించారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే షాపులు తెరుచుకోవాలని, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూముల్లోకి అనుమతించాలని స్ఫ‌ష్టం చేశారు.

అవసరమైతే డ్రంకెన్​డ్రైవ్ కేసులను పెంచుతామని, ఉదయమంతా పని చేసుకొని సాయంత్రం పూట మాత్రమే తాగేలా మార్పు తీసుకొస్తామన్నారు. మద్యం విచ్చలవిడిగా లభ్యమవడంతో పనులు మానుకొని అదే పనిగా తాగుతూ జ‌నం చనిపోతున్నార‌ని చెప్పారు. యువత మద్యానికి బానిసై పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో నియోజకవర్గంలో మద్యం షాపుల సమయపాలన విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గంలో ప్రమాదాల నివారణకు పోలీసుల సహకారంతో తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement