త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Rajagopal Reddy | రేవంత్‌తో ఇబ్బందేం లేదు.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే నా సేవ‌లు అవ‌స‌రం

Komatireddy Rajagopal Reddy | ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో త‌న‌కెలాంటి ఇబ్బంది లేదు.. కానీ కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే నా సేవ‌లు అవ‌స‌ర‌మ‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Mar 24, 2026, 5.08 pm IST

Komatireddy Rajagopal Reddy | రేవంత్‌తో ఇబ్బందేం లేదు.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే నా సేవ‌లు అవ‌స‌రం
Advertisement

మంత్రి ప‌ద‌వి కోసం పాకులాడ‌డం లేదు..
నాకు మంత్రి ప‌ద‌వి ఇస్తే కాంగ్రెస్‌కు మంచి పేరొస్తుంది..
అది త‌ప్ప‌ని కేటీఆర్‌కు చెప్పాను

Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో త‌న‌కెలాంటి ఇబ్బంది లేదు.. కానీ కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే నా సేవ‌లు అవ‌స‌ర‌మ‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో మీడియాతో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చిట్ చాట్ చేశారు.

మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం గతంలో హామీ ఇచ్చింది. అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తుందో... తెలియదు. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు. ఏ పదవి లేకున్నా రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో తగిన గౌరవం ఉంటుంది. నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నా లాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరం అని కోమ‌టిరెడ్డి పేర్కొన్నారు.

నాకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదు. నిన్న ముఖ్యమంత్రితో ప్రత్యేక భేటీ లేదు, ఎదురుపడితే పలకరించుకున్నాం. ఇవాళ కేటీఆర్‌తో కూడా సాధారణంగా అన్ని విషయాలపై మాట్లాడాను. 2018 ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పని కేటీఆర్‌కు చెప్పానని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement