G Kishan Reddy | దక్షిణాది ఇంధన భద్రతలో సింగరేణి కీలకం కావాలి : కిషన్ రెడ్డి
G Kishan Reddy | దక్షిణ భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి కాలరీస్ కంపెనీ మరింత కీలక పాత్ర పోషించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న 10 నుంచి 15 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
G Kishan Reddy | దక్షిణ భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి కాలరీస్ కంపెనీ మరింత కీలక పాత్ర పోషించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న 10 నుంచి 15 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తి పెంపుతో పాటు కొత్త గనుల సాధన, కోల్ గ్యాసిఫికేషన్ వంటి భవిష్యత్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో మంత్రి సంస్థ పనితీరు, ఉత్పత్తి, రవాణా, కొత్త గనుల పురోగతి, అనుమతుల ప్రక్రియ, భవిష్యత్ ప్రణాళికలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు అనుగుణంగా సింగరేణి తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని సూచించారు.
దేశంలో విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు అవసరం ఇంకా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. అందువల్ల బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, కేంద్ర బొగ్గు శాఖ నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి చురుకుగా పాల్గొని కొత్త గనులను దక్కించుకోవాలని సూచించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ పని సామర్థ్యాన్ని పెంచే దిశగా సంస్థ అడుగులు వేయాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే నాణ్యత, సామర్థ్యం, ప్రణాళికాబద్ధమైన నిర్వహణ ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. కేవలం వ్యాపార లాభాలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్ ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగాలని సూచించారు. సంస్థలో చేపట్టే సంస్కరణలు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. అలాగే సంస్థ వాస్తవ పరిస్థితులు, ఆర్థిక స్థితి, భవిష్యత్ కార్యాచరణపై ఉద్యోగులకు పారదర్శకంగా వివరించి వారిని అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయాలని చెప్పారు. ఉద్యోగులే సింగరేణి అసలైన బలమని, వారి సహకారంతోనే సంస్థ మరింత అభివృద్ధి సాధించగలదని పేర్కొన్నారు.
దేశంలో కోల్ గ్యాసిఫికేషన్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎరువుల పరిశ్రమలు, ఇతర పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి ప్రారంభ దశలోనే చిన్న స్థాయిలో అయినా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున బొగ్గు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను ముందుగానే బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. అదనపు బొగ్గు ఉత్పత్తి వినియోగదారులకు సకాలంలో చేరేలా రవాణా వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని, అవసరమైన కాంట్రాక్టులను వేగంగా ఖరారు చేయాలని సూచించారు.
సమావేశంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంస్థ ప్రస్తుత పరిస్థితులు, ఉత్పత్తి, రవాణా, కొత్త ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ హోదా తొలగిన తర్వాత అటవీ భూముల అనుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ అంశంపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి బొగ్గు రవాణాకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. సమీక్ష సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ అధికారులు, సింగరేణి డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kidney Symposium 2026 | కిడ్నీ మార్పిడిలో అద్భుతాలు: 400+ సర్జరీలతో యశోద హాస్పిటల్స్ సరికొత్త రికార్డ్
ఆగస్టు 29, 2026

Harish Rao | రేవంత్! దివ్యాంగులపై మానవత్వం లేదా? వారికిస్తానన్న రూ.6,000 పెన్షన్ ఏది?
ఆగస్టు 29, 2026

Kadiyam Srihari | మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి
ఆగస్టు 29, 2026
తాజావార్తలు
- ●Thriller OTT | ప్రేమిస్తే భరత్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ - విలన్‌గా లేడీ యాంకర్ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- ●Traffic diversions | రేపే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్.. ట్రాఫిక్ మళ్లింపు వివరాలివే
- ●NEET PG Student Suicide | కన్నవారికి కడుపుకోత: చదువుల ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థిని ఆత్మహత్య
- ●Telangana Seed Act | నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు తక్షణమే నష్టపరిహారం
- ●Batti Vikramarka | మారిషస్‌లో తెలుగును ప్రమోట్ చేసేందుకు సహకరిస్తాం
- ●నిజామాబాద్ వేదికగా కల్వకుంట్ల కవిత ‘పాంచజన్య’ వ్యూహం: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త శకానికి తెరలేపుతున్నారా?

Thriller OTT | ప్రేమిస్తే భరత్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ - విలన్‌గా లేడీ యాంకర్ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Traffic diversions | రేపే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్.. ట్రాఫిక్ మళ్లింపు వివరాలివే

NEET PG Student Suicide | కన్నవారికి కడుపుకోత: చదువుల ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థిని ఆత్మహత్య

Telangana Seed Act | నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు తక్షణమే నష్టపరిహారం



