Illegal Dumping | రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ వార్నింగ్
Illegal Dumping | నిర్మాణ వ్యర్థాలను (Illegal Dumping) రోడ్లపై వేసే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) అధికారులు హెచ్చరించారు. రోడ్లతోపాటు ఖాళీ స్థలాల్లో భవన వ్యర్థాలు పోస్తే భారీగా జరిమానాలు విధించడంతోపాటు, ఆ వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టంచేశారు.
Illegal Dumping | త్రినేత్ర.న్యూస్: నిర్మాణ వ్యర్థాలను (Illegal Dumping) రోడ్లపై వేసే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) అధికారులు హెచ్చరించారు. రోడ్లతోపాటు ఖాళీ స్థలాల్లో భవన వ్యర్థాలు పోస్తే భారీగా జరిమానాలు విధించడంతోపాటు, ఆ వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్, అక్రమంగా డంపింగ్ విషయంలో తొలిసారి రూల్స్ అతిక్రమిస్తే రూ.25 వేల జరిమానా విధిస్తామని చెప్పారు. అదే తప్పు రెండోసారి చేస్తే రూ.50 వేలు.. మూడోసారి కూడా రూల్స్ ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధించడంతోపాటు.. ఆ వ్యర్థాలను తీసుకొచ్చే వాహనాలను కూడా సీజ్ చేస్తామని పేర్కొన్నారు.
నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గుర్తింపు పొందిన ప్రాసెసింగ్ ప్లాంట్లకు మాత్రమే నిర్మాణ వ్యర్థాలు, భవన నిర్మాణ కూల్చివేతల వ్యర్థాలను తరలించాలని సూచించారు. రోడ్లు (Road Sides), ఖాళీ స్థలాలు (Open Plots), నాలాలు, ఇతర ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలను పారేస్తే కఠిన చర్యల తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా వ్యర్థాలు పోసినట్లు గుర్తిస్తే ఫొటో తీసి, 90634 21300 నంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అందరి చేయి, చేయి కలిపి మల్కాజిగిరిని అందంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.. హైదరాబాద్‌లో ఈ రాత్రికి భారీ వర్షం..
జూన్ 28, 2026

Eiffel Tower Lightning | ఈఫిల్ టవర్‌పై భారీ పిడుగు.. క్షణాల్లో మారిన వాతావరణం.. VIDEO
జూన్ 28, 2026

Mancherial | వేటగాళ్లను పట్టించిన ‘పొగాకు’.. ఆ వాసనను పసిగట్టిన స్నిఫర్ డాగ్
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.. హైదరాబాద్‌లో ఈ రాత్రికి భారీ వర్షం..
- ●Eiffel Tower Lightning | ఈఫిల్ టవర్‌పై భారీ పిడుగు.. క్షణాల్లో మారిన వాతావరణం.. VIDEO
- ●Mancherial | వేటగాళ్లను పట్టించిన 'పొగాకు'.. ఆ వాసనను పసిగట్టిన స్నిఫర్ డాగ్
- ●CEC Sudarshan Reddy | బీఎల్వోలకు డమ్మీ ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వండి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి
- ●Leopard | ఖానాపురంలో చిరుతపులి సంచారం.. ఆందోళనలో స్థానికులు
- ●Khushbu | కూతురి పెళ్లి ఫొటోలపై విమర్శలు - నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఖుష్బూ

Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.. హైదరాబాద్‌లో ఈ రాత్రికి భారీ వర్షం..

Eiffel Tower Lightning | ఈఫిల్ టవర్‌పై భారీ పిడుగు.. క్షణాల్లో మారిన వాతావరణం.. VIDEO

Mancherial | వేటగాళ్లను పట్టించిన 'పొగాకు'.. ఆ వాసనను పసిగట్టిన స్నిఫర్ డాగ్

CEC Sudarshan Reddy | బీఎల్వోలకు డమ్మీ ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వండి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి



