త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | క‌మీష‌న్ల క‌క్కుర్తితో సింగ‌రేణిని నిర్వీర్యం చేస్తున్న సీఎం రేవంత్‌: క‌విత‌

Kavitha | మెడిక‌ల్ బోర్డును నామ‌మాత్రంగా నిర్వ‌హించి సింగ‌రేణి (Singareni) కార్మికుల‌ను కాంగ్రెస్ పార్టీ (Congress) మ‌రోసారి మోసం చేసింద‌ని తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితి (TRS) అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) విమ‌ర్శించారు.

G

Telangana | Published On Jul 19, 2026, 1.12 pm IST

Kavitha | క‌మీష‌న్ల క‌క్కుర్తితో సింగ‌రేణిని నిర్వీర్యం చేస్తున్న సీఎం రేవంత్‌: క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్: మెడిక‌ల్ బోర్డును నామ‌మాత్రంగా నిర్వ‌హించి సింగ‌రేణి (Singareni) కార్మికుల‌ను కాంగ్రెస్ పార్టీ (Congress) మ‌రోసారి మోసం చేసింద‌ని తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితి (TRS) అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) విమ‌ర్శించారు. సింగ‌రేణిని కాపాడాల‌ని, కార్మికుల‌కు మంచి చేయాల‌ని, వారికి భ‌రోసా ఇవ్వాల‌న్న ఉద్దేశం కప్ర‌భుత్వానికి లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2 వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు (Medical Board) కోసం ఎదురు చూస్తుంటే కేవలం 120 మంది కార్మికుల పేర్లు మాత్రమే ప్రకటించార‌ని, అందులోనూ 28 మంది కార్మికులకు తమను మెడికల్ బోర్డుకు పిలిచారనే సమాచారం కూడా లేద‌ని మండిప‌డ్డారు. మెడికల్ బోర్డుకు పిలిచిన వారిలో కేవలం 20 శాతం మందినే అన్ ఫిట్ చేశార‌ని విమ‌ర్శించారు. మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న 2 వేల మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేన‌ని అప్పటి వరకు తెలంగాణ రక్షణ సేన ఉద్యమిస్తుందని చెప్పారు.

మెడికల్ బోర్డు నిర్వహించకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించడంతోనే ప్రభుత్వం నామమాత్రంగా రెండు రోజుల పాటు మెడికల్ బోర్డు నిర్వహించిందని మండిప‌డ్డారు. కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమీషన్లకు సీఎం రేవంత్ (Revanth Reddy), డిప్యూటీ సీఎం భ‌ట్టివిక్ర‌మార్క (Bhatti Vikramarka) కక్కుర్తి పడి సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. గతంలో మాదిరిగానే అన్ ఫిట్ (Medical Unfit) ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు సిగ్గుతో తలదించుకోవాల‌న్నారు. కార్మికులకు అన్యాయం జరుగుతుంటే సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మీరు మీ ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకుంటరా? బతిమాలుకుంటరా? అనేది వారే నిర్ణయించుకోవల‌న్నారు. ప్రతినెలా రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టించేలా చర్యలు తీసుకోవాల‌న్నారు. కోల్ బెల్ట్ (Coal Belt) ప్రాంత ఎమ్మెల్యేలను నిలదీయాలని హెచ్ఎంఎస్ (HMS), తెలంగాణ రక్షణ సేన క్యాడర్‌కు పిలుపునిచ్చారు. కార్మికులకు తెలంగాణ రక్షణ సేన ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు.

Advertisement
Advertisement