త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వ ద్వంద్వ వైఖ‌రి: క‌విత‌

Kavitha | పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఎన్‌డబ్ల్యూడీఏ మీటింగ్‌లో మరోసారి బయట పడింద‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన (TRS) అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) విమ‌ర్శించారు.

G

Telangana | Published On Nov 4, 2026, 11.15 am IST

Kavitha | పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వ ద్వంద్వ వైఖ‌రి: క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర న్యూస్‌: పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఎన్‌డబ్ల్యూడీఏ మీటింగ్‌లో మరోసారి బయట పడింద‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన (TRS) అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) విమ‌ర్శించారు. గోదావరి - కావేరి నదుల అనుసంధానం సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని అధికారులు ఎన్‌డబ్ల్యూడీఏ (NWDA) సమావేశాల్లో కోరడం.. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు (Polavaram Banakacherla Link Project) ఓకే చెప్పడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి నదీ జలాల వినియోగంపై ఇసుమంతైనా అవగాహన లేదని.. నిర్ధిష్టమైన విధానం లేదని తేటతెల్లం అవుతున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ (Telangana) నీటి హక్కులను కాలరాస్తుందని మొట్ట మొదట స్పందించింది తామేన‌ని వెల్ల‌డించారు. తెలంగాణ జాగృతి తరపున 2024లోనే ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేశామ‌ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హెచ్చరించామ‌న్నారు. తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఏపీ సీఎం చంద్రబాబుకు గురు దక్షిణగా చెల్లించుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంద‌ని విమ‌ర్శించారు.

దక్షిణాది రాష్ట్రాల సమావేశంలోనే కాదు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలోనూ రేవంత్ రెడ్డి పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు (PBLP) ఓకే చెప్పి మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు మాట్లాడార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రేవంత్ రెడ్డి ఆమోదంతోనే ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు. రేవంత్ రెడ్డి ఇకనైనా కళ్లు తెరిచి పీబీ లింక్ ప్రాజెక్టుతో (P B Link Project) తెలంగాణకు వాటిల్లే ముప్పును గుర్తించాల‌న్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం చేపట్టిన అన్ని సంప్రదింపుల నుంచి తెలంగాణ వైదొలగాల‌ని డిమాండ్ చేశారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రికి లేఖ రాయాల‌న్నారు.

ట్యాగ్స్:

KavithaNWDAPBLPPolavaram Banakacherla Link ProjectRevanth ReddyTelanganaTRS
Advertisement
Advertisement