త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Conductor Pravalika | ప‌ది రోజులు మృత్యువుతో పోరాడి.. ఆర్టీసీ కండ‌క్ట‌ర్ ప్ర‌వ‌ళిక మృతి

Conductor Pravalika | చిల్లర విషయంలో జ‌రిగిన గొడ‌వ‌లో తీవ్రంగా గాయపడిన మ‌ణుగూరు డిపో ఆర్టీసీ కండ‌క్ట‌ర్ గుండ్ల ప్రవళిక (Conductor Pravalika) మృతిచెందారు. పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మంగళవారం రాత్రి మ‌ర‌ణించారు.

G

Telangana | Published On Nov 4, 2026, 7.39 am IST

Conductor Pravalika | ప‌ది రోజులు మృత్యువుతో పోరాడి.. ఆర్టీసీ కండ‌క్ట‌ర్ ప్ర‌వ‌ళిక మృతి
Advertisement

Conductor Pravalika | త్రినేత్ర న్యూస్‌: చిల్లర విషయంలో జ‌రిగిన గొడ‌వ‌లో తీవ్రంగా గాయపడిన మ‌ణుగూరు డిపో ఆర్టీసీ కండ‌క్ట‌ర్ గుండ్ల ప్రవళిక (Conductor Pravalika) మృతిచెందారు. పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మంగళవారం రాత్రి మ‌ర‌ణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన ప్రవళిక (24)కు.. ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేసిన తండ్రి నాగరాజు చనిపోవడంతో వారసత్వంగా పదినెలల క్రిత‌మే కండక్టర్‌ ఉద్యోగం వచ్చింది. మణుగూరు (Manuguru) డిపోలో పనిచేస్తున్నారు. గతనెల 25న మణుగూరు నుంచి భద్రాచలం (Bhadrachalam) వెళ్లే సర్వీసులో విధులు నిర్వహిస్తుండ‌గా.. అశ్వాపురం మండలం పిచికలతండాకు చెందిన ప్రమాణికురాలు బానోత్‌ మౌనిక బ‌స్సు ఎక్కారు. ఆమెతోపాటు బాలుడు కూడా ఉండ‌టంతో టికెట్ తీసుకోవాల‌ని కండ‌క్ట‌ర్‌ అడిగారు. దీంతో ఆమె మిట్ట‌గూడెంకు టికెట్ తీసుకున్నారు. అయితే కుమారుడి టికెట్‌ చార్జీ నిమిత్తం రూ.100 ఇవ్వ‌డం, త‌న వ‌ద్ద స‌రిప‌డా చిల్ల‌ర లేక‌పోవ‌డంతో దిగేప్పుడు తీసుకోవాల‌ని చెప్పారు. దీంతో ఇద్ద‌రిమ‌ధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో మిట్టగూడెం సెంటర్‌ వద్దకు చేరుకున్న సమయంలో ఆ ప్రయాణికురాలు.. ప్రవళికను బస్సులో నుంచి కిందకు తోసేసింది. దాంతో ప్రవళిక కిందపడగా, బస్సు వెనుక చక్రాలు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయ్యాయి. వెంటనే ఆమెను భద్రాచలం ద‌వాఖాన‌కు, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని (Hyderabad) కొత్త‌పేట సాయి సంజీవ‌ని హాస్పిట‌ల్‌కు తరలించారు. పది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రవళిక చివరకు మంగళవారం రాత్రి మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఉస్మానియా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. కాగా, ప్ర‌వ‌ళిక మృతిపై ఆర్టీసీ కార్మికులు, యూనియ‌న్ నాయ‌కులు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌గా నిల‌వాల‌ని, ఆర్థిక స‌హాయంతోపాతు కుటుంబానికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందించాల‌ని డిమాండ్ చేశారు.

కోలుకొని తిరిగి విధుల్లో చేరుతారని ఆశించా: మంత్రి పొన్నం

మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. `ఇటీవల ప్రయాణికులతో జరిగిన వివాదంలో బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడిన ప్రవళికకు హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాం. వారు ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకొని తిరిగి విధుల్లో చేరుతారని ఆశించాను. వారు మృతి చెందడం అత్యంత బాధాకరం.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రవళిక మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ,ప్రవళిక కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ అన్ని విధాలా అండగా ఉంటాయని భరోసా ఇస్తున్నాను.` అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఎక్స్‌వేదిక‌గా ట్వీట్ చేశారు.

ట్యాగ్స్:

BhadrachalamConductor PravalikaHyderabadManuguruPonnam PrabhakarTGSRTC
Advertisement
Advertisement