త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఐదో రోజూ లాభాల జోరు.. సెన్సెక్స్ 77 వేల పైకి, నిఫ్టీ 23,890కి..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల బాటలో పయనించాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 288 పాయింట్లు పెరిగి 77,185.35కు చేరగా, నిఫ్టీ 77.25 పాయింట్లు లాభపడి 23,890.85 వద్ద ట్రేడయింది. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్లకు ప్రధానంగా మద్దతునిచ్చాయి.

S

Business | Published On Nov 4, 2026, 10.40 am IST

Stock Markets | ఐదో రోజూ లాభాల జోరు.. సెన్సెక్స్ 77 వేల పైకి, నిఫ్టీ 23,890కి..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల బాటలో పయనించాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 288 పాయింట్లు పెరిగి 77,185.35కు చేరగా, నిఫ్టీ 77.25 పాయింట్లు లాభపడి 23,890.85 వద్ద ట్రేడయింది. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్లకు ప్రధానంగా మద్దతునిచ్చాయి. సెన్సెక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. మరోవైపు పవర్ గ్రిడ్, ఎటర్నల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 0.43 శాతం తగ్గి బ్యారెల్‌కు 103.2 డాలర్లకు చేరింది.

పెరుగుతున్న ఎఫ్ఐఐల కొనుగోళ్లు..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) మంగళవారం భారత ఈక్విటీ మార్కెట్లలో రూ.6,836.81 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజీల గణాంకాలు వెల్లడించాయి. విదేశీ పెట్టుబడిదారుల వైఖరిలో వచ్చిన మార్పు మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చిందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలు, లార్జ్ క్యాప్ షేర్ల ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు మార్కెట్ ర్యాలీకి ప్రాథమిక మద్దతునిస్తున్నాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఆధారిత షేర్లలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ధోరణి మారడం కూడా విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల వైపు తిరిగి రావడానికి దోహదపడిందని వివరించారు.

న‌ష్టాల్లో ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ సూచీలు నష్టాల్లో ట్రేడవగా, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ స్వల్ప లాభాల్లో కొనసాగింది. అమెరికా ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. కాగా మంగళవారం భారత మార్కెట్లలో భారీ ర్యాలీ నమోదైంది. సెన్సెక్స్ 1,225.07 పాయింట్లు (1.62 శాతం) పెరిగి 76,917.85 వద్ద, నిఫ్టీ 370.05 పాయింట్లు (1.58 శాతం) లాభపడి 23,810.85 వద్ద ముగిశాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 3,671.82 పాయింట్లు (5 శాతం), నిఫ్టీ 1,112 పాయింట్లు (4.89 శాతం) పెరిగాయి. దీంతో వరుసగా ఐదో రోజు కూడా మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది.

ట్యాగ్స్:

Indian Stock MarketNifty 50SensexStock Market RallyStock Markets
Advertisement
Advertisement