Jagtial | జగిత్యాల బాలుడి దత్తత వివాదంలో మరో ట్విస్ట్
Jagtial | జగిత్యాల బాలుడి దత్తత వివాదంలో మరో ట్విస్ట్ ఏర్పడింది. గత నెలలో ఇచ్చిన హైకోర్టు తీర్పును జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సవాల్ చేశారు.
Jagtial | త్రినేత్ర న్యూస్ : జగిత్యాల బాలుడి దత్తత వివాదంలో మరో ట్విస్ట్ ఏర్పడింది. గత నెలలో ఇచ్చిన హైకోర్టు తీర్పును జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సవాల్ చేశారు. మూడేళ్లుగా పెంచుకుంటున్న బాలుడిని తల్లిదండ్రుల నుంచి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వేరు చేశారు. చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ జరగలేదంటూ శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని అక్టోబర్ 16న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సీడబ్ల్యూసీ నిబంధనలు, అధికారులు సమర్పించిన ఆధారాలను.. పరిశీలించకుండానే ఉత్తర్వులు ఇచ్చారని కలెక్టర్ వాదించారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన దత్తతను చట్టబద్ధంగా పరిగణించడంపై పరిశీలించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బాలుడిని తిరిగి శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించాలని అధికారులు అభ్యర్థించారు. తల్లిదండ్రుల వద్ద బాలుడు ఉంటే విచారణకు ఆటంకం కలుగుతుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. బాలుడిని దంపతులకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్, అధికారుల విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cabinet Decisions | 92 GWh విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
- ●TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్
- ●US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లకు మహర్దశ..?
- ●King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్
- ●IND Vs NZ ODI | కోహ్లీ విధ్వంసం.. కివీస్‌పై భారత్ ఘన విజయం
- ●Bandi Sanjay KTR Bouncer Row | ట్విట్టర్ టిల్లు మీది మేనేజ్మెంట్ కోటా.. మాది మెరిట్ కోటా..!

Cabinet Decisions | 92 GWh విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్

US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లకు మహర్దశ..?

King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్





