Katta Shekar Reddy | త్రినేత్ర.న్యూస్ : నమస్తే తెలంగాణ పూర్వ సంపాదకులు, ఆర్టీఐ మాజీ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి రాసిన తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకావిష్కరణ ఈ నెల 4వ తేదీన జరగనుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఆత్మీయ అథితులుగా సీనియర్ సంపాదకులు కే రామచంద్రమూర్తి, కే శ్రీనివాస్, అల్లం నారాయణ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి, కవి, రచయిత జూలూరు గౌరీ శంకర్ హాజరు కానున్నారు. సీనియర్ జర్నలిస్టు, రచయిత కోవెల సంతోష్ కుమార్ పుస్తక పరిచయం చేయనున్నారు.