Enugu Narasimha Reddy | తల్లి జోలపాటల్లోంచే బాలసాహిత్యం ప్రారంభమవుతుంది: ఏనుగు నర్సింహారెడ్డి
Enugu Narasimha Reddy | తల్లి జోలపాటల్లోంచే బాలసాహిత్యం ప్రారంభమవుతుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి (Enugu Narasimha Reddy) అన్నారు. పిల్లల్లోని సృజనాత్మకతను తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించి వారిని ప్రోత్సాహించాలని సూచించారు.
Enugu Narasimha Reddy | తల్లి జోలపాటల్లోంచే బాలసాహిత్యం ప్రారంభమవుతుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి (Enugu Narasimha Reddy) అన్నారు. పిల్లల్లోని సృజనాత్మకతను తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించి వారిని ప్రోత్సాహించాలని సూచించారు. పాఠశాల స్థాయి విద్యార్థినీ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ (Telangana Sahitya Academy) నిర్వహించిన కథ, కవిత, పద్య, నాటికల పోటీకీ మంచి స్పందన వచ్చింది. వివిధ ప్రక్రియల్లో బహుమతులు పొందిన వారికి బహుమతి ప్రదాన కార్యక్రమం రవీంద్ర భారతి (Ravindra Bharathi)లోని పైడి జయరాజ్ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పోటీకి వచ్చిన ఉత్తమ కథలతో వెలువడిన 'బాలల ప్రపంచం' కథా సంకలనాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ బాలలకు మంచి చేకూర్చేది బాలసాహిత్యం అని అన్నారు. వేమన, సుమతి శతకాలు పిల్లల్లో నైతిక విలువల పెంపుదలకు దోహదం చేస్తాయని చెప్పారు. చందమామ లాంటి బాల సాహిత్య పత్రికలు బాలలు నిరంతరం చదవడం వల్ల వారికి భాషమీద పట్టు పెరుగుతుందని పేర్కొన్నారు. సాహిత్యం పిల్లల జీవితంలో భాగమైతే వారి విద్యా ఉద్యోగ జీవితాల్లో విజయం సాధించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ పి. రవీందర్, విశిష్ట అతిథిగా హాజరైన బాలచెలిమి సంపాదకులు డా.మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ పిల్లల రచనలపై మనం దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఆ రచనలు పిల్లల వద్దకు చేరవేయాలని, అందుకు పాఠశాల ఉపాధ్యాయుల కృషి అవసరమని చెప్పారు. తెలంగాణలో బాల సాహితీవేత్తలైన ఉపాధ్యాయులు ఆ పనిలో నిమగ్నమై ఉండడం అభినందనీయమన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ బాల సాహిత్యానికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని పాఠశాల విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలన్నారు.
బాలసాహిత్య ఆవశ్యకతను, అందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ చేస్తున్న కృషిని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కథా వర్క్ షాప్ లో కథా రచనలో మెలకువలు అనే అంశంపైన బాలసాహితీ వేత్తలు డా.వి.ఆర్.శర్మ, డా. అమరవాది నీరజ ప్రసంగించి మెలకువలు తెలిపారు. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, గరిపెల్లి అశోక్ సమన్వయం చేసిన ఈ సభలో న్యాయనిర్ణేతలు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
సంబంధిత వార్తలు

Phule Birth Anniversary | పూలే స్ఫూర్తితో తల రాతను మార్చుకుందాం: మంత్రి వాకిటి శ్రీహరి
ఏప్రిల్ 11, 2026

Minister Damodar Raja Narasimha | కలిసి పోరాడితే క్యాన్సర్‌ను గెలవొచ్చు: వరల్డ్ హెల్త్ డే లో మంత్రి దామోదర రాజనర్సింహ
ఏప్రిల్ 7, 2026

Alishetty Prabhakar | రవీంద్ర భారతిలో అలిశెట్టి జయంతి సభ
జనవరి 12, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



