Karthika Masam | నేటి నుంచి కార్తీక మాసం.. శివారాధకులకు ప్రీతిపాత్రమైన నెల
Karthika Masam | ఏడాదిలో పన్నెండు నెలలు ఉన్నా.. అందులో కార్తీక మాసానికి (Karthika Masam) విశిష్టత ఉన్నది. శివారాధకులకు ఈ నెల ప్రీతికరమైనది. సనాతన ధర్మంలో కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.
Devotional | Published On Nov 10, 2026, 8.09 am IST
Karthika Masam | త్రినేత్ర న్యూస్: ఏడాదిలో పన్నెండు నెలలు ఉన్నా.. అందులో కార్తీక మాసానికి (Karthika Masam) విశిష్టత ఉన్నది. శివారాధకులకు ఈ నెల ప్రీతికరమైనది. సనాతన ధర్మంలో కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. దీపారాధన (Deeparadhana), తులసీ పూజ, శివాభిషేకాలు, ఉపవాసాలు, దానధర్మాలతో ఈ మాసమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వెలిగించే దీపం, చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ‘కార్తీకం’ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి (Deepavali) అమావాస్యతో ఆశ్వయుజ మాసం ముగిసింది. మంగళవారం (నవంబర్ 10) నుంచి కార్తీక మాసం ప్రారంభమయింది. డిసెంబర్ 8న (మంగళవారం) ఈ మాసం ముగియనుంది. ఈనెలలో భక్తులు నియమ నిష్ఠలకు ప్రాధాన్యం ఇస్తారు. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. కొందరు కార్తీక సోమవారాలు.. ఉపవాసం పాటిస్తారు. నదీ, సముద్ర స్నానాలు ఆచరిస్తారు.

సోమవారాలకు ఎంతో విశిష్టత..
కార్తీక మాసంలో పవిత్ర సోమవారాలకు (Karthika Somavaram) ఎంతో విశిష్టత ఉంది. పరమశివునికి ప్రీతిపాత్రమైన ఈ రోజుల్లో భక్తులు ప్రత్యేక ఉపవాసాలు, శివాభిషేకాలు నిర్వహిస్తారు. మొదటి కార్తీక సోమవారం నవంబర్ 16న ఉంటుంది. రెండో సోమవారం 23వ తేదీన, మూడో సోమవారం 30న, నాలుగో సోమవారం డిసెంబర్ 7న వస్తాయి. ఇక ఈ మాసంలో అత్యంత ప్రధానమైన కార్తీక పౌర్ణమి (Karthika Pournami) ఉత్సవం ఈ నెల 24వ తేదీ మంగళవారం వస్తుంది.
ఈ నెలలో భక్తులు తెల్లవారుజామున నిద్ర లేచి పవిత్ర స్నానం ఆచరించి.. శివాలయాలకు వెళ్తారు. ఈ నెలంతా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటాయి. భక్తుల శివ నామస్మరణతో దేవాలయాలు మార్మోగుతాయి. తులసి మొక్క వద్ద ఆవు నేతితో దీపం వెలిగిస్తారు. ఈ నెల మొత్తం నిత్యం రెండు పూటల ఆవునెయ్యితో దీపారాధన చేయడం వల్ల శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

శివుడితోపాటు శ్రీమహావిష్ణువును కూడా..
ఈ మాసంలో శివుడితో పాటు శ్రీమహావిష్ణువును (Maha Vishnuvu) కూడా సమానంగా ఆరాధిస్తారు. `శివాయ విష్ణు రూపాయ.. విష్ణు రూపాయ శివాయ` అనే భక్తి భావనతో హరిహరులకు భేదం లేదని ఈ మాసం చాటిచెబుతుంది. ఇళ్లల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో తుళసి కోట వద్ద, పూజా మందిరాల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి, మనశ్శాంతి లభిస్తాయి.

కార్తీక మాసంలోని ముఖ్య పండుగలు.. పుణ్య తిథులు
నవంబర్ 10: కార్తీక శుద్ధ పాడ్యమి సందర్భంగా బలి పాడ్యమి, ఆకాశదీపారంభం జరుగుతాయి.
నవంబర్ 11: యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం నిర్వహిస్తారు.
నవంబర్ 13: నాగుల చవితి సందర్భంగా నాగదేవతలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
నవంబర్ 15: తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
నవంబర్ 16: కోటి సోమవారం
నవంబర్ 17: వృశ్చిక సంక్రమణం
నవంబర్ 19: యాజ్ఞవల్క జయంతి
నవంబర్ 20: ప్రబోధన ఏకాదశి
నవంబర్ 21: క్షీరాబ్ది ద్వాదశి.. కైశిక ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి వంటి విశేష పర్వదినాలు ఉన్నాయి.
నవంబర్ 22: పక్ష ప్రదోషం
నవంబర్ 24: కార్తిక పౌర్ణమి
నవంబర్ 27: సంకష్టహర చతుర్థి
డిసెంబర్ 4: కార్తీక బహుళ ఏకాదశి
డిసెంబర్ 6: పక్ష ప్రదోషం
డిసెంబర్ 7: మాస శివరాత్రి వస్తాయి.
డిసెంబర్ 8: కార్తిక అమావాస్యతో కార్తిక మాసం ముగుస్తుంది.
సంబంధిత వార్తలు

Deepavali | దీపావళి వేళ 48 మందికి గాయాలు.. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స
నవంబర్ 9, 2026

16 రోజుల్లో 2500 కి.మీ… రామేశ్వరం నుంచి అయోధ్యకు యువకుడి సైకిల్ యాత్ర
నవంబర్ 8, 2026

Diwali 2026 | దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?.. లక్ష్మీ పూజ శుభ ముహూర్తం, 5 రోజుల క్యాలెండర్, పూజా విధానం ఇదే..!
నవంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Indian Railway | భారతీయ రైల్వేలో 4651 అప్రెంటిస్‌లు..
- ●Pawan Kalyan | మూడోసారి పవన్ కల్యాణ్ విడాకులు.. అన్నా లెజినోవాతో డివర్స్
- ●Horoscope | నవంబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●LB Nagar Sadar Festival Accident | సదర్ ఉత్సవాల్లో విషాదం: దున్నపోతును ఆడిస్తూ కుప్పకూలి 16 ఏళ్ల బాలుడు మృతి
- ●Bangladesh Woman Fake Aadhaar Hyderabad | బంగ్లాదేశ్ యువతి నకిలీ ఆధార్‌తో భారతీయురాలిగా చలామణి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి!
- ●Revanth Reddy | పోలేపల్లి ఎల్లమ్మ తల్లిపై ఆన.. డిసెంబర్ నాటికి కొడంగల్ బీడు భూములు తడుపుతా

Indian Railway | భారతీయ రైల్వేలో 4651 అప్రెంటిస్‌లు..

Pawan Kalyan | మూడోసారి పవన్ కల్యాణ్ విడాకులు.. అన్నా లెజినోవాతో డివర్స్

Horoscope | నవంబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారికి శుభ ఖర్చులు ఉంటాయి!

LB Nagar Sadar Festival Accident | సదర్ ఉత్సవాల్లో విషాదం: దున్నపోతును ఆడిస్తూ కుప్పకూలి 16 ఏళ్ల బాలుడు మృతి



