Kamareddy | కామారెడ్డిలో విషాదం.. పెంచలేక ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి
Kamareddy | కామారెడ్డి పట్టణం (Kamareddy) ఆర్బీనగర్ కాలనీలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన విశాదాంతమయింది. పెంచలేక తన కుమార్తెలను చంపేసినట్లు తండ్రి ఇస్మాయిల్ అంగీకరించారు.
Kamareddy | త్రినేత్ర.న్యూస్: కామారెడ్డి పట్టణం (Kamareddy) ఆర్బీనగర్ కాలనీలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన విశాదాంతమయింది. పెంచలేక తన కుమార్తెలను చంపేసినట్లు తండ్రి ఇస్మాయిల్ అంగీకరించారు. వారిని పెద్ద చెరువులో తోసేసినట్లు చెప్పారు. ఆర్బీ నగర్‌కు చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులు. వారికి షీపత్ (8), ఆయత్ (7), మరియం (5) కుమార్తెలు. ఇస్మాయిల్ ఆటో నడుపుతుండగా.. షబీనా కూలి పనులకు వెళ్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. అయితే ఇటీవల వారికి ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. రూ.5లక్షలకు పైగా అప్పులు ఉన్నాయి. అప్పిచ్చినవాళ్లు డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుండటం, పిల్లల పెంచడం ఇబ్బందిగా మారడంతో.. పిల్లలను చంపాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నట్లుగానే అర్ధరాత్రి ముగ్గురు పిల్లలను స్థానిక చెరువులో తోసేశాడు. ప్రాణాలు పోయాయా? లేదా? అని నిర్ధారించుకునేందుకు అరగంట పాటు అక్కడే ఉన్నాడు. ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వచ్చేశాడు. అయితే పిల్లలు కనిపించకపోవడంతో ఇస్మాయిల్ భార్య షబీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. తండ్రి ఇస్మాయిల్‌పై అనుమానం రావడంతో ఆయనను ప్రశ్నించారు. దీంతో అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, తమదైన శైలిలో విచారించారు. ఈ సందర్భంగా ముగ్గురు కూతుర్లను తానే చంపినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని ఘటనా స్థలానికి చెరువులో నుంచి పిల్లల్ని వెలికి తీశారు.
Also Read..
బ్యాట్ Vs బాల్.. అహ్మదాబాద్ వేదికగా నేడు రసవత్తర పోరు
జాతీయ స్మారకాలుగా గొల్లాల గుడి.. శివాలయం!
సంబంధిత వార్తలు

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఆగస్టు 20, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



