త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar | రైల్వే అండ‌ర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామ‌ల‌ విన‌తి

Chamala Kirankumar | నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని బీబీనగర్-నడికూడ రైల్వే మార్గంలో ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 26 వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు వినతిపత్రం ఇచ్చిన‌ట్లు భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ (Chamala Kirankumar) తెలిపారు.

S

Telangana | Published On Oct 30, 2026, 7.21 pm IST

Chamala Kirankumar | రైల్వే అండ‌ర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామ‌ల‌ విన‌తి
Advertisement

Chamala Kirankumar | త్రినేత్ర న్యూస్: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని బీబీనగర్-నడికూడ రైల్వే మార్గంలో ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 26 వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు వినతిపత్రం ఇచ్చిన‌ట్లు భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ (Chamala Kirankumar) తెలిపారు. ఈమేర‌కు శుక్ర‌వారం ఆయ‌నను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీ మ‌ల్లు ర‌వి త‌దిత‌ర ముఖ్య నేత‌ల‌తో వెళ్లి ఢిల్లీలో క‌లిసిన‌ట్లు పేర్కొన్నారు.

చిట్యాల పట్టణాన్ని మునుగోడు మండల కేంద్రంతో ఈ రైల్వే క్రాసింగ్ అనుసంధానించ‌డంలో కీలక మార్గంగా ఉంది. ప్రతి రైలు వెళ్లే సమయంలో గేటు దాదాపు 15 నిమిషాల పాటు మూసివేస్తుండ‌డంతో ప్రయాణికులు, రైతులు, విద్యార్థులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి వెళ్లే ట్రాఫిక్‌పై కూడా దీని ప్రభావం పడుతోంది. రైల్వే లైన్ విద్యుదీకరణ తర్వాత రైళ్ల రాకపోకలు పెరుగుతున్నాయి. ఎటువంటి అంతరాయం లేకుండా రాక‌పోక‌లు సాగించేందుకు ఈ ఆర్వోబీ నిర్మాణం అత్యవసరంగా మారింది.

రోజూ వేలాది మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఆర్వోబీ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలి అని కేంద్ర మంత్రిని కోరిన‌ట్లు ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ తెలిపారు.

ట్యాగ్స్:

Ashwini VaishnavBhuvanagiriBibinagar NadikudaChamala KirankumarMemorandumROBTelangana
Advertisement
Advertisement