KTR | సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ సైటర్లు..!
KTR | ఎంత కండలు తిరిగిన వస్తాదులైనా మూడునెలల్లో పిల్లలను పుట్టిస్తారా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సెటైరికల్‌గా స్పందించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఫిర్జాదిగూడలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
KTR | ఎంత కండలు తిరిగిన వస్తాదులైనా మూడునెలల్లో పిల్లలను పుట్టిస్తారా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సెటైరికల్‌గా స్పందించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఫిర్జాదిగూడలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 'అందరూ అన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లవుతుంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం ఎన్నికలకు ముందు ఊదరగొట్టేలా హామీలు ఇచ్చారు. అందరికీ అన్ని ఇస్తామని హామీలు ఇచ్చారు. డిక్లరేషన్లతో పాటు 420 హామీలు ఇచ్చారు. ఆరు గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేస్తామని మొత్తానికి అధికారంలోకి వచ్చారు. కానీ, మేడ్చల్‌లో, హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మలేదు. ఓఆర్ఆర్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇవ్వకుండా చైతన్యం ప్రదర్శించారు' అన్నారు.
ఆషాఢం సేల్స్‌లా బంపర్ ఆఫర్లు ఇచ్చారు..
'జిల్లాల్లో రైతు సోదరులు కాంగ్రెస్‌ను నమ్మి అవకాశం ఇస్తే రేవంత్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నడు. ఎన్నికలకు ముందు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తమని అన్నరు. రూ.2వేల పెన్షన్ రూ.4వేల పెన్షన్ చేస్తామన్నరు. అత్తకు రూ.4వేలు, కోడలికి రూ.2500 ఇస్తామన్నరు. మహాలక్ష్మీ పథకం కింద రాష్ట్రంలోని 1.62 కోట్ల మంది ఆడపిల్లలకు రూ.2500 ఆర్థిక సాయం చేస్తారు. లగ్గంచేసుకుంటే కేసీఆర్ రూ.లక్ష ఇస్తుండు. మేం అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తామన్నారు. చదువుకుంటే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని.. పది పాసైతే నెలకు పదివేలు, ఇంటర్ పిల్లలకు రూ.12వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీ చదివితే రూ.లక్ష, పీహెచ్‌డీ చేస్తే రూ.లక్ష ఇస్తమంటూ ఆషాఢం సేల్స్‌లా ఇష్టం వచ్చినట్లు బంపర్ ఆఫర్లు ఇచ్చుకుంటూ తిరిగారు' అంటూ విమర్శించారు కేటీఆర్.
అధికారంలోకి వచ్చి 30 నెలలైంది..
'ఇవాళ సీఎంని అడిగితే.. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అంటివి? డిక్లరేషన్లు ఎక్కడపోయినవి అంటే.. నిన్నగాక మొన్న ఆదిలాబాద్‌లో మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి కూడా మాట్లాడ కూడని మాట మాట్లాడిండు. ఎంత కండలు తిరిగిన వస్తాదైనా.. కండలు తిరిగిన ఫహిల్వాన్ అయినా మూడునెలల్లో పిల్లలు పుట్టియ్యరు కదా? అంటున్నడు. అయ్యా ముఖ్యమంత్రి మూడునెలల్లో పిల్లలు పుట్టియ్యరని మా అందరికీ తెలుసు. మరి మీ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతుంది. మరి 30 నెలల్లో పిల్లలు పుట్టించనివారని ఏమనాలి? ఆరు గ్యారంటీలు.. వంద రోజులు అంటివి కదా? 30 నెలలు దగ్గరపడ్డది. ఇప్పటి వరకు అత్త లేదు పత్తా లేదు. గట్టిగా మాట్లాడితే కేసు పెడుత అంటడు. ఇంకా గట్టిగ మాట్లాడితే నీ లాగుల తొండలు ఇడిచిపెడుత అంటున్నడు' అంటూ మండిపడ్డారు.
చేసింది ఏమీ లేదు..
'ఈ బజారు మాటలు తప్ప మంచి చేసింది లేదు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు గరీబోళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్నం. ఎవరో తెలిసో తెలియక గవర్నమెంట్ జాగలో ఇళ్లు కట్టుకుంటే వారికి అవకాశం ఇచ్చి పట్టాలు ఇచ్చాం. జీవో నెంబర్ 59, 58 కింద 2.50లక్షల మందికి పట్టాలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకున్నం. ఇట్ల ఎన్నో మంచి పనులు చేశాం. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మి పేరు మీద ఓ మేనమామలాగా 15లక్షల మందికి రూ.లక్ష ఇచ్చారు. ఆడబిడ్డకు బిడ్డ పుడితే అమ్మ ఒడి కింద రూ.12వేలు, రూ.13వేలు ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో వాహనంలో తీసుకువెళ్లి ఇంటి వద్దనే దించి వచ్చేలా ఏర్పాట్లు చేశారు' అని కేటీఆర్ వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
- ●Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి





