Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి
Sridhar Babu | నిబంధనల మేరకే భూ కేటాయింపులు జరిగాయని.. 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలన్నారు. తాము కోటిన్నరకు ఇచ్చిన ఎకరా భూమిని.. బీఆర్ఎస్ ప్రభుత్వం 90 లక్షలకే ఇచ్చిందని చెప్పారు.
- మేం ఎకరా భూమిని కోటిన్నరకు కేటాయించాం.. బీఆర్ఎస్ 90 లక్షలకే కట్టబెట్టింది
- పారిశ్రామికవేత్తలను భయపెట్టడం మంచిది కాదు
- కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు హితవు
Sridhar Babu | త్రినేత్ర.న్యూస్: నిబంధనల మేరకే భూ కేటాయింపులు జరిగాయని.. 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలన్నారు. తాము కోటిన్నరకు ఇచ్చిన ఎకరా భూమిని.. బీఆర్ఎస్ ప్రభుత్వం 90 లక్షలకే ఇచ్చిందని చెప్పారు. హిల్ట్ పాలసీ వల్ల హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పారిశ్రామికవేత్తలను భయపెట్టడం కేటీఆర్‌కు మంచిది కాదని చురకలంటించారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన "ప్రజలతో ముఖాముఖి" కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు, వినతులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. భూకేటాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

జీఆర్ఎంబీ మీటింగ్‌కు అటెండై బలంగా కొట్లాడుతం
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం సరైంది కాదు. మాపైన ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపకండి. అభివృద్ధి విషయంలో అన్ని ప్రభుత్వాలు కొనసాగించాయి.. మేమూ కొనసాగిస్తున్నాం. నీటి వాటాల్లో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసింది. మా వాటా విషయంలో రాజీపడం. జీఆర్ఎంబీ (GRMB) మీటింగ్‌కు అటెండ్ అవుతాం.. బలంగా కొట్లాడుతాం అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
కేసీఆర్ ఫాం హౌస్‌లో పండిన వరికి వచ్చిన ధర.. కేటీఆర్ తెలంగాణ రైతులకు చెప్పాలి. అసత్యాలతో కేటీఆర్ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారంతో ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారు అని మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి
- ●Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..

MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం




