త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jupally Krishna Rao | ఆర్భాటాలకు పోయి… అప్పుల పాలు కాకండి: మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధిలో (Telangana) ఎన్ఆర్ఐలు భాగ‌స్వాములు కావాల‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. అమెరికాలోని త‌మ‌ మిత్రులు, విదేశీ సహోద్యోగులకు తెలంగాణ పర్యాటక వైభవాన్ని పరిచయం చేయాల‌ని, సెలవుల్లో వారిని రాష్ట్రానికి తీసుకురావాల‌ని సూచించారు.

G

Telangana | Published On Aug 2, 2026, 10.00 am IST

Jupally Krishna Rao | ఆర్భాటాలకు పోయి… అప్పుల పాలు కాకండి: మంత్రి జూపల్లి కృష్ణారావు
Advertisement

Jupally Krishna Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధిలో (Telangana) ఎన్ఆర్ఐలు భాగ‌స్వాములు కావాల‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. అమెరికాలోని త‌మ‌ మిత్రులు, విదేశీ సహోద్యోగులకు తెలంగాణ పర్యాటక (Telangana Tourism) వైభవాన్ని పరిచయం చేయాల‌ని, సెలవుల్లో వారిని రాష్ట్రానికి తీసుకురావాల‌ని సూచించారు. అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మహాసభల్లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం సప్త సముద్రాలు దాటి అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలు అక్కడి ఆర్థిక, సాంకేతిక పురోగతికి విశేషంగా దోహదపడుతున్నారన్నారు. అదే సమయంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో సజీవంగా నిలబెట్టడంలో వారి పాత్ర మరింత గొప్పదని కొనియాడారు. 1990లో ఏర్పాటైన ఆటా అమెరికాలోని తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు చేస్తున్న సేవలు అభినందనీయమని చెప్పారు. పుట్టి పెరిగిన పల్లెల అభివృద్ధికి ప్రవాసులు అందిస్తున్న సహకారం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఎన్ఆర్ఐలు అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

హైద‌రాబాద్‌లో ఎన్ఆర్ఐ భ‌వ‌న్‌..

అమెరికా నుంచి తెలంగాణకు వచ్చే ప్రవాస భారతీయులకు అన్ని సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా హైదరాబాద్‌లో (Hyderabad) రూ.10 కోట్ల వ్యయంతో ఎన్ఆర్ఐ భవన్ (NRI Bhavan) నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అది ప్రవాస భారతీయులకు సమన్వయ కేంద్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలో అపారమైన పర్యాటక సామర్థ్యం ఉందని, దానిని ప్రపంచానికి పరిచయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఆటా బృందాలు లేదా ఎన్ఆర్ఐ గ్రూపులు దత్తత తీసుకుని, వాటి అభివృద్ధి, పరిరక్షణ, పునరుద్ధరణకు చేయూత అందించాలని కోరారు.

తాహ‌తుకు మించి ఖ‌ర్చు చేస్తున్నారు..

సమాజంలో జీవన విధానం ఆందోళనకరంగా మారుతున్న‌దని మంత్రి జూపల్లి చెప్పారు. విద్య, వైద్యం పేరుతో ప్రజలు తమ తాహతుకు మించి కార్పొరేట్ సంస్థల్లో ఖర్చు చేస్తున్నారని, ప్రభుత్వం ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ కార్పొరేట్ స్థాయిలో సేవలు అందిస్తున్న‌దని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వ్య‌స‌నాలకు బానిస‌వుతున్న యువ‌త‌..

సామాజిక హోదా కోసం కొందరు పెళ్లిళ్లు, పేరంటాలు, ఇతర వేడుకలను ఆర్భాటంగా నిర్వహించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని పొదుపు చేసుకోవాలని హితవు పలికారు. యువత వ్యసనాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, ఇలాంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం కల్పించే లక్ష్యంతో ‘ప్రభాత భేరి’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సామాజిక ఉద్యమంలో ప్రవాస భారతీయులు కూడా తమ వంతు సహకారం అందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement