Plane Crash | కుప్పకూలిన పర్యాటకుల విమానం.. 13 మంది దుర్మరణం
Plane Crash | దక్షిణ అమెరికా దేశమైన పెరూలో (Peru) ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. విదేశీ పర్యాటకులను (foreign tourists) తీసుకెళ్తున్న ఒక చిన్న విమానం కుప్పకూలింది. దీంతో సిబ్బందిసహా 13 మంది విదేశీ పర్యాటకులు మృతి చెందారు.
International | Published On Aug 2, 2026, 8.23 am IST
Plane Crash | త్రినేత్ర.న్యూస్: దక్షిణ అమెరికా దేశమైన పెరూలో (Peru) ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. విదేశీ పర్యాటకులను (foreign tourists) తీసుకెళ్తున్న ఒక చిన్న విమానం కుప్పకూలింది. దీంతో సిబ్బందిసహా 13 మంది విదేశీ పర్యాటకులు మృతి చెందారు.
పెరూలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం, యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా (World Heritage site) గుర్తింపు పొందిన నాజ్కా లైన్స్ (Nazca Lines archaeological site) చూడటానికి 11 మంది పర్యాటకులు ఓ చిన్న విమానంలో వెళ్తున్నారు. రాజధాని లిమాకు సుమారు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిస్కో విమానాశ్రయం (Pisco airport) నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత విమానం నాజ్కా నగరం వెలుపల ఉన్న ఎడారి మైదానంలో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 11 మంది విదేశీ ప్రర్యాటకులు, ఇద్దరు విమాన సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు తెలిపారు. విమాన భాఆలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతుల్లో ఏడుగురు ఇటాలియన్లు, ఇద్దరు జర్మనీ పౌరులు, మరో ఇద్దరు స్పెయిన్‌కు చెందినవారని చెప్పారు.

కాగా, శతాబ్దాల క్రితం ఎడారిలో గీసిన భారీ జియోగ్లిఫ్‌లు కేవలం విమానాల నుంచే స్పష్టంగా కనిపిస్తాయి. జంతువుల ఆకారాల్లో ఉన్న ఈ భారీ జియోగ్రాఫ్‌లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతి ఏడాది ఈ ప్రదేశాన్ని సుమారు లక్ష మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.

వాతావరణం అనుకూలించకనే..
ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కూలిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గంటకు 40 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన ఈదురు గాలుల వల్ల దుమ్ము ఎగసిపడటంతో విజిబిలిటీ దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ ఘోర ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమా లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులే ముంచెత్తాయా అనే కోణంలో పెరూ విమానయాన అధికారులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి గురైన విమానం ఎరోడియానా (AeroDiana) సంస్థకు చెందిన. ఈ సంస్థ గత 14 ఏండ్లుగా సెస్నా గ్రాండ్ కారవాన్ విమానాలతో ఇక్కడ పర్యాటకులకు సైట్‌సీయింగ్ సేవలు అందిస్తున్నది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●iPhone 17 Pro | ఐఫోన్ 17 ప్రొ పై భారీ డిస్కౌంట్.. రూ.56,990కే..
- ●వరంగల్ నుంచి బీజేపీ బిగ్ ప్లాన్.. మధుకర్, దశరథ్కు కీలక బాధ్యతలు!
- ●Junior Civil Courts | రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు
- ●Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు
- ●Plane Crash | కుప్పకూలిన సైనిక విమానం.. సీనియర్ అధికారులు సహా 14 మంది దుర్మరణం

iPhone 17 Pro | ఐఫోన్ 17 ప్రొ పై భారీ డిస్కౌంట్.. రూ.56,990కే..

వరంగల్ నుంచి బీజేపీ బిగ్ ప్లాన్.. మధుకర్, దశరథ్కు కీలక బాధ్యతలు!

Junior Civil Courts | రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు

Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య






