Weekly Horoscope | ఈవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు, ప్రతి వారం తమ రాశిఫలాలకు అనుగుణంగా వ్యక్తులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
ఉద్యోగంలో ఆశించిన పదోన్నతులు అందుకుంటారు. ఉత్సాహంగా అనుకున్న వ్యవహారాలు పూర్తిచేస్తారు. వ్యాపారంలో నష్టం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, భూముల కొనుగోలులో అడ్డంకులను అధిగమిస్తారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా ఓర్పు, సహనంతో ఉంటే మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు రావచ్చు.
వృషభం (Taurus)
అన్ని రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థికంగానూ, సామాజికంగానూ బలపడతారు. ఉద్యోగంలో బ్రహ్మాండమైన యోగం ఉంది. ఏపని చేపట్టినా విజయమే వరిస్తుంది. మీ బుద్ధిబలం, సమయస్ఫూర్తితో వ్యాపారంలో అత్యుత్తమమైన ఫలితాలు రాబట్టుతారు. అధికార యోగం బలంగా ఉంది. సంపదలు పెరుగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీపై ప్రేమానురాగాలు చూపుతారు. కుటుంబంలో శుభాలు జరుగుతాయి.వివాహాది శుభకారాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత విస్తరించి ముందడుగు వేస్తారు. సన్నిహితులతో చేసే ప్రయాణాలు ఆహ్లాదంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు లక్ష్యసాధనలో ముందుకు సాగుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం (Gemini)
ఈ వారి అన్ని రంగాల వారికి ఈ వారం శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తికావడమే ధ్యేయంగా ముందుకు సాగుతారు. వృత్తిపరంగా మీ నైపుణ్యాలను పెంచుకుంటారు. ఉద్యోగంలో మీపై వచ్చిన అపవాదులు తొలగిపోతాయి. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా మంచి ధనయోగం ఉంది. ఖర్చులు పెరగవచ్చు. భూవివాదాలు పరిష్కారదశకు చేరుతాయి. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. మాటల నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కర్కాటకం (Cancer)
ఈ వారం అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాల కోసం మరింత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అన్నివిధాలా అనుకూల సమయం. ఉద్యోగంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంతో ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఊహించని రీతిలో ధనలాభం ఉండవచ్చు. భూములు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. కుటుంబంలో కలహాలు ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
సింహం (Leo)
ఈ వారం అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. పనుల్లో కొంత జాప్యం జరిగినా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాల్లో గందరగోళం తొలగిపోతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో ధనయోగం ఉంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలుచేస్తారు. కొత్త సంస్థల ఏర్పాటులో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. బంధుమిత్రులతో అనుబంధం దృఢ పడుతుంది. ఆత్మీయుల నుంచి మరింత ఆదరణ పొందుతారు. వారాంతంలో ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
కన్య (Virgo)
ఈ వారం అన్ని రంగాల వారికి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. పని ప్రదేశంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తారు. ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. గతంలో ఆగిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి అందిన సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వారాంతంలో ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
తుల (Libra)
ఈ వారి అన్ని రంగాల వారికి వృత్తి పరంగా, వ్యక్తిగతంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారు. పని ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులున్నా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆశించిన లాభాలు పొందుతారు. ఒక మరపురాని సంఘటన ఎదురుకావచ్చు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి విజయం సాధిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. కుటుంబసభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వృథా ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికం (Scorpio)
ఈ వారం అన్ని రంగాల వారికి తగిన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో మనోబలంతో ముందుకెళ్లడం అవసరం. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు క్రమంగా విస్తరిస్తారు. లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మీ కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మంచిది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెట్టవచ్చు.
ధనుస్సు (Sagittarius)
ఈ వారం అన్ని రంగాల వారు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లక్ష్యసాధనకు మనోబలంతో ప్రయత్నించాలి. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమించి ముందడుగు వేస్తారు. నూతన ప్రయత్నాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహానిస్తాయి. ఏ విషయం గురించి అతిగా ఆలోచించవద్దు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఆశించిన ఫలితాలు మరికొంత ఆలస్యం కావచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది.
మకరం (Capricorn)
ఈ వారం అన్ని రంగాల వారికి శుభ సమయం నడుస్తున్నది. ఉద్యోగంలో పదోన్నతులు, స్థానచలనం ఉండవచ్చు. మీ కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆర్థికంగా మంచి యోగదాయకంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. ఇంటి నిర్మాణాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు ఉంటాయి. వారాంతంలో ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. నూతన పరిచయాలు ఉంటాయి.
కుంభం (Aquarius)
ఈ వారం అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉజ్వలమైన భవిష్యత్తు గోచరిస్తోంది. హోదా కొంత పెరుగుతుంది. వ్యాపారాలు మునుపటికంటే లాభదాయకంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థితి లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. అత్యంత నేర్పుగా శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తుల వ్యవహారాల్లో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు.
మీనం (Pisces)
ఈ వారం అన్ని రంగాల వారికి మంచి శుభకాలం కొనసాగుతోంది. ఉద్యోగాలలో పని ఒత్తిడుల నుంచి బయటపడతారు. గతంలో ఉన్న సమస్యలు తొలగడంతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన ప్రయత్నాలకు సరైన సమయం. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ మితవ్యయం పాటించడం మంచిది. భూముల కొనుగోలు వివాదాలు సర్దుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తాజావార్తలు
- ●August 12 Solar Eclipse 2026 | ఒకే రోజు 4 అరుదైన ఖగోళ వింతలు! ఆకాశంలో 6 గ్రహాల పరేడ్, పరిపూర్ణ సూర్యగ్రహణం.. భారత్లో కనిపిస్తుందా?
- ●Singareni Apprenticeship | సింగరేణిలో అప్రెంటిస్లు.. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారు అర్హులు
- ●Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
- ●Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ
- ●Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ

August 12 Solar Eclipse 2026 | ఒకే రోజు 4 అరుదైన ఖగోళ వింతలు! ఆకాశంలో 6 గ్రహాల పరేడ్, పరిపూర్ణ సూర్యగ్రహణం.. భారత్లో కనిపిస్తుందా?

Singareni Apprenticeship | సింగరేణిలో అప్రెంటిస్లు.. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారు అర్హులు

Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ






