Police Recruitment | పోలీసు శాఖలో 5 వేల కొలువులు.. త్వరలో నోటిఫికేషన్
Police Recruitment | ఉద్యోగార్థులకు శుభవార్త. హోంశాఖలో పోలీస్, జైళ్లు, అగ్నిమాపకశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి (Police Recruitment) ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Police Recruitment | త్రినేత్ర.న్యూస్: ఉద్యోగార్థులకు శుభవార్త. హోంశాఖలో పోలీస్, జైళ్లు, అగ్నిమాపకశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి (Police Recruitment) ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో 2 వేల పోస్టుల కోసం త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. వీటిలో ఎస్పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన పోస్టులుండనున్నాయి. ఇక పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.78 జారీచేసింది. తెలంగాణ పోలీస్ నియామక మండలి (TSLPRB) ద్వారా నియామక ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన సంబంధించిన నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో వెలువబనుంది.

గత పన్నెండేండ్లలో పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టడం ఇది నాలుగోసారి. 2015 సంవత్సరం చివరిరోజున తొలిసారిగా 9,281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆ తర్వాత 2018లో 1,217 మంది ఎస్సై స్థాయి పోస్టులు, 16,285 మంది కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మూడోసారి 2022లో 554 ఎస్సై స్థాయి పోస్టులతో పాటు 15,644 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా నోటిఫికేషన్ నాలుగోది.
5 వేల ఖాళీలు ఇలా..
- సివిల్ ఎస్ఐ- 148
- ఏఆర్ ఎస్ఐ- 14
- టీజీఎస్పీ ఏఆర్ ఎస్ఐ- 12
- ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐ- 3
- ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ- 23
- సివిల్ కానిస్టేబుల్- 3,697
- ఏఆర్ కానిస్టేబుల్- 1,052
- ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్- 24
- కానిస్టేబుల్ (డ్రైవర్) పీటీవో- 20
- కానిస్టేబుల్ (మెకానిక్) పీటీవో- 7
సంబంధిత వార్తలు

Infant Dies | జోగిపేటలో దారుణం.. 18 రోజుల పసికందును నేలకేసి కొట్టిన తండ్రి
జులై 18, 2026

KTR | 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
జులై 18, 2026

WCL Recruitment | డిప్లొమా అర్హతతో డబ్ల్యూసీఎల్లో 444 మైనింగ్ సిర్దార్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పోస్టులు
జులై 18, 2026
తాజావార్తలు
- ●NEET 2026 Winners | ఒకే ఇంట్లో ముగ్గురు నీట్ విజేతలు.. ఆదర్శంగా నిలుస్తున్న తోబుట్టువులు
- ●India Post Payments Bank | పోస్టాఫీస్‌లో మహిళలకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న సేవింగ్స్ ఖాతా.. దీని ప్రత్యేకతలు ఇవే..
- ●Vikarabad | రోడ్ల అభివృద్ధికి పెద్దపీట : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- ●Ponnam Prabhakar | చేతిలో గాజుల బుట్టతో మంత్రి పొన్నం.. బీసీ వృత్తికారులకు సర్కార్ అభయం!
- ●Python | కేబీఆర్ పార్కులో 20 అడుగుల భారీ కొండచిలువ.. Video
- ●Mutual Funds | మార్కెట్లో 4 కొత్త మ్యుచువల్ ఫండ్ స్కీమ్స్.. పెట్టుబడి రూ.500 మాత్రమే..

NEET 2026 Winners | ఒకే ఇంట్లో ముగ్గురు నీట్ విజేతలు.. ఆదర్శంగా నిలుస్తున్న తోబుట్టువులు

India Post Payments Bank | పోస్టాఫీస్‌లో మహిళలకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న సేవింగ్స్ ఖాతా.. దీని ప్రత్యేకతలు ఇవే..

Vikarabad | రోడ్ల అభివృద్ధికి పెద్దపీట : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Ponnam Prabhakar | చేతిలో గాజుల బుట్టతో మంత్రి పొన్నం.. బీసీ వృత్తికారులకు సర్కార్ అభయం!



