త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ప్ర‌జ‌ల క‌ల‌ను సాకారం చేసినందుకే కాంగ్రెస్‌లో చేరా.. ది హిందూ గ్రూప్ డైరెక్ట‌ర్ ఎన్‌ రామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | అర‌వై ఏళ్ల‌కుపైగా తెలంగాణ ప్ర‌జ‌లు కంటున్న క‌ల‌ల‌ను సోనియాగాంధీ సాకారం చేసినందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ‌ను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. విద్యార్థిగా విద్యార్థి ప‌రిష‌త్‌లో ప‌ని చేశాన‌ని, త‌ర్వాత వ్యాపారం చేశాన‌ని పేర్కొన్నారు.

P

Telangana | Published On Jun 6, 2026, 6.30 pm IST

CM Revanth Reddy | ప్ర‌జ‌ల క‌ల‌ను సాకారం చేసినందుకే కాంగ్రెస్‌లో చేరా.. ది హిందూ గ్రూప్ డైరెక్ట‌ర్ ఎన్‌ రామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | అర‌వై ఏళ్ల‌కుపైగా తెలంగాణ ప్ర‌జ‌లు కంటున్న క‌ల‌ల‌ను సోనియాగాంధీ సాకారం చేసినందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ‌ను ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. విద్యార్థిగా విద్యార్థి ప‌రిష‌త్‌లో ప‌ని చేశాన‌ని, త‌ర్వాత వ్యాపారం చేశాన‌ని పేర్కొన్నారు. 2006 జులైలో ఇండిపెండెంట్‌గా జ‌డ్పీటీసీ స‌భ్యునిగా గెలిచాన‌ని, 2007లో స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గానే గెలిచాన‌ని గుర్తు చేశారు. త‌ర్వాత టీడీపీలో చేరి, ప‌దేళ్లు చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేశాన‌ని, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాన‌ని వివ‌రించారు. బెంగుళూరులో ది హిందూ హ‌డిల్ కార్య‌క్ర‌మంలో ది హిందూ గ్రూప్ డైరెక్ట‌ర్ ఎన్‌. రామ్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభ‌జ‌న‌, స్థానిక కార‌ణాల‌తో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్య‌త్వానికి, తెదేపా స‌భ్య‌త్వానికి రాజీనామా చేశాన‌ని చెప్పారు.

అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన పోరాటం కావాల‌ని ప్ర‌జ‌లు భావించారని, దాంతోనే తాను టీడీపీకి రాజీనామా చేశాన‌ని పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో త‌న ఎదుట ఎన్నో మార్గాలున్నాయి.. కానీ కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు తెలిపారు. తాను కాంగ్రెస్‌లో చేరే స‌మ‌యంలోనే త‌న‌ రాజ‌కీయ ప్ర‌స్థానానికి సంబంధించిన‌ అన్ని విష‌యాలు రాహుల్ గాంధీకి తెలిపాన‌ని చెప్పారు. 2018 డిసెంబ‌రు ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన‌ప్ప‌టికీ, మూడు నెల‌ల త‌ర్వాత మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచాన‌ని, త‌ర్వాత పీసీసీ అధ్య‌క్షుడుని, ముఖ్య‌మంత్రిని అయ్యానని వివ‌రించారు. 2026 జులైతో త‌న‌ ప్ర‌జా జీవితం 20 ఏళ్లు పూర్త‌వుతుందని తెలిపారు. త‌న‌కు ఎటువంటి రాజ‌కీయ నేప‌థ్యం లేదని, క‌ష్టించే ప‌నిత‌త్వం... తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వ‌చ్చాన‌ని అన్నారు.

త్వ‌ర‌లోనే 5వేల పోలీసు ఉద్యోగాల నోటిఫికేష‌న్‌

త్వ‌ర‌లోనే రాష్ట్రంలో అయిదు వేల పోలీసు ఉద్యోగ నియామ‌కాల నోటిఫికేష‌న్ ఇవ్వ‌బోతున్నామ‌ని రేవంత్‌రెడ్డి తెలిపారు. 15 నెల‌ల్లో తాము 67,760 ఉద్యోగాలు ఇచ్చామ‌ని, దేశంలోనే అత్యధిక సంఖ్య‌లో ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెప్పారు. రెండు వారాల క్రితం నోటిఫికేష‌న్లు ఇచ్చామ‌ని, యువ‌త ఇప్పుడు ఉద్యోగాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారని పేర్కొన్నారు. గ‌తంలో రాష్ట్రాన్ని పాలించే అవ‌కాశం వ‌చ్చిన వారు పాల‌కులుగా భావించారని, కానీ తాను సేవ చేయ‌డానికి వ‌చ్చిన ప్ర‌జా ప్ర‌తినిధిగా భావించాన‌ని అన్నారు. సామాన్యుల స‌మ‌స్య‌లు ఏమిటో అర్ధం చేసుకున్నానని పేర్కొన్నారు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వరంగంలో 2 ల‌క్ష‌లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అప్ప‌టి ప్ర‌భుత్వం ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేదని ఆరోపించారు. తాను పీసీసీ అధ్య‌క్షునిగా ఉన్న‌ప్పుడు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డంతో పాటు పాద‌యాత్ర చేసి, యువ‌త స‌మ‌స్య‌ను, వాళ్ల ఆవేద‌న‌ను అర్థం చేసుకున్నాన‌ని వివ‌రించారు. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పున‌రావాస కేంద్రంగా ఉండ‌కూడ‌దని భావించి, తాను యూపీఎస్సీ ఛైర్మ‌న్‌, ఇత‌ర స‌భ్యుల‌ను క‌లిసి, వారితో చ‌ర్చించాన‌ని చెప్పారు. యూపీఎస్సీ ఎలా ప‌ని చేస్తుందో తెలుసుకోవ‌డంతో పాటు ఎటువంటి వివాదాలు లేకుండా నియామ‌క ప్ర‌క్రియ ఎలా చేప‌డుతున్నారో తెలుసుకుని, దానినే టీజీపీఎస్సీలో అమ‌లు చేశాన‌ని వివ‌రించారు.

రైతు ఆత్మ‌హ‌త్య‌లేని రాష్ట్రంగా తెలంగాణ‌

గ‌తంలో మ‌హారాష్ట్ర త‌ర్వాత తెలంగాణ‌లోనే ఎక్కువ సంఖ్య‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగేవని ముఖ్య‌మంత్రి అన్నారు. దానికి కార‌ణం అప్పులని చెప్పారు. తాను అధికారంలోకి వ‌చ్చాక 25,035 రైతు కుటుంబాల‌కు చెందిన రూ.20,616 కోట్ల రుణాల‌ను మాఫీ చేశాన‌ని, ఇది దేశంలోనే అత్య‌ధిక రుణ‌మాఫీ అని వివ‌రించారు. 2024-25 సంవ‌త్స‌రంలో రైతు ఆత్మ‌హ‌త్య‌లు లేని రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొందని గుర్తు చేశారు. రైతులు సంతోషంగా ఉన్నారని, రైతులు ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎమ్మార్పీ) కోసం పోరాడారని చెప్పారు. తాను ఎమ్మార్పీ ఇవ్వ‌డంతో పాటు ధాన్యం రైతుల‌కు క్వింటాలుకు రూ.500 బోన‌స్ ఇచ్చాన‌ని పేర్కొన్నారు. పంట సేక‌ర‌ణ‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదని, ఎమ్మార్పీ ప్ర‌క‌టించి చేతులు దులుపుకుంటోందని మండిప‌డ్డారు. పంట ఉత్ప‌త్తుల సేక‌ర‌ణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ, ధాన్యం, మొక్క‌జొన్న‌తో పాటు ఇత‌ర పంట‌లను తాము సేక‌రిస్తున్నామ‌ని వివ‌రించారు. రైతు భ‌రోసా కింద ఎక‌రాకు రూ.12 వేలు ఇస్తున్నామ‌ని, వాటిని రైతులు ఎరువులు, పెట్టుబ‌డికి ఉప‌యోగించుకుంటున్నారని చెప్పారు.

Advertisement
Advertisement