CM Revanth Reddy | 240 ఎకరాల్లో రూ. 2,400 కోట్లతో కోహెడ ఫ్రూట్ మార్కెట్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్రంలోని రైతులు, ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కోహెడలో 240 ఎకరాల్లో రూ. 2,400 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని రైతులు, ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కోహెడలో 240 ఎకరాల్లో రూ. 2,400 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్రూట్ మార్కెట్‌కు శంకుస్థాపన అనంతరం సీఎం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
ఒకనాడు రంగారెడ్డి జిల్లా నుంచి పాలు, కూరగాయలు, పండ్లు ఉత్పత్తి అయ్యేవి. చివరకు పాలకూర, కొత్తిమీర కావాలన్నా రంగారెడ్డి జిల్లాల ప్రజలే అందించేవారు. కష్టపడి పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పాలను సూర్యుడు ఉదయించకముందే హైదరాబాద్ నగరానికి తరలించేవారు. ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు వచ్చిన తర్వాత భూముల విలువలు పెరిగాయి. వ్యవసాయం కుంటుపడింది. గ్రేప్ గార్డెన్స్ కనిపించేవి. ఇప్పుడు అవి ఏవీ లేవు అని సీఎం తెలిపారు.
రైతులకు దెబ్బలు తగిలి కష్టాలు ఎదుర్కొన్నారు..
ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో ఒక కోటి 30 లక్షల జనాభా నివసిస్తున్నారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారింది. గోదావరి, కృష్ణా జలాలు దాహార్తిని తీర్చాయి. ఒకప్పుడు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు తరలిస్తే టెంట్లు రేకులు కూలిపోయి రైతులకు దెబ్బలు తగిలి కష్టాలు ఎదుర్కొన్నారు. అందర్నీ కలిశాను. పరామర్శించాను. మల్ రెడ్డి రంగారెడ్డితో మాట్లాడి మన ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ కట్టుకుంటామని చెప్పాను. నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల్లో పెళ్లి ఉన్నా పండుగ ఉన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా 240 ఎకరాల్లో 2400 కోట్లు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడ ఫ్రూట్ మార్కెట్‌ను శంకుస్థాపన చేసుకుంటున్నాం అని సీఎం పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వంలో ధరలు పెరిగాయి
ఆర్గానిక్ ఫుడ్ అని పాలు పండ్లు కూరగాయలే కాదు కొత్తిమీర పాలకూర కూడా దిగుమతి చేసుకుంటున్నారు. మన రైతాంగం వడ్లు, మక్కలు, జొన్నలు, పత్తి పండించడంతో విపరీతమైన ఒత్తిడి పెరిగి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడి జేబులో చిల్లిగవ్వ ఉండడం లేదు.. మోదీ ప్రభుత్వంలో ధరలు పెరిగాయి. 30 ఏండ్ల క్రితం మన ప్రాంతం ఎలా కళకళలాడిందో.. మళ్లీ మామిడి బత్తాయి పండ్లు పండించాలి. కందుకూరులో టమాటలు పండిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. అక్కడ సాస్ కంపెనీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫ్రూట్ మార్కెట్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటున్నారు అని రేవంత్ ధ్వజమెత్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MK Stalin | రాష్ట్రపతి పాలనను అడ్డుకునేందుకే విజయ్‌కి మద్దతు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టాలిన్..!
- ●Pooja Hegde | 70 కోట్ల బడ్జెట్ - ఏడు కోట్ల కలెక్షన్స్ - పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్
- ●CM Revanth Reddy | భారత్ ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాం.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
- ●KTR | కాలనాగులతో జాగ్రత్త.. 2028లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే : కేటీఆర్
- ●CM Revanth Reddy | పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి.. హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●CV Anand | మహిళల, పిల్లల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్

MK Stalin | రాష్ట్రపతి పాలనను అడ్డుకునేందుకే విజయ్‌కి మద్దతు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టాలిన్..!

Pooja Hegde | 70 కోట్ల బడ్జెట్ - ఏడు కోట్ల కలెక్షన్స్ - పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్

CM Revanth Reddy | భారత్ ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాం.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

KTR | కాలనాగులతో జాగ్రత్త.. 2028లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే : కేటీఆర్




