త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Markapuram Accident | మార్కాపురం బ‌స్సు ప్ర‌మాదం.. ఇద్ద‌రు జ‌గిత్యాల వాసులు మృతి

Markapuram Accident | ఆంధ్ర‌ప్ర‌దేశ్ మార్కాపురం జిల్లా రాయ‌వ‌రం స‌మీపంలో జ‌రిగిన ప్ర‌యివేటు ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాదంలో 13 మంది స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఈ అగ్నికీల‌ల్లో ఇద్ద‌రు జ‌గిత్యాల వాసులు కూడా చిక్కుకుని ప్రాణాలొదిలారు.

S

Telangana | Published On Mar 26, 2026, 2.39 pm IST

Markapuram Accident | మార్కాపురం బ‌స్సు ప్ర‌మాదం.. ఇద్ద‌రు జ‌గిత్యాల వాసులు మృతి
Advertisement

Markapuram Accident | త్రినేత్ర‌.న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మార్కాపురం జిల్లా రాయ‌వ‌రం స‌మీపంలో జ‌రిగిన ప్ర‌యివేటు ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాదంలో 13 మంది స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఈ అగ్నికీల‌ల్లో ఇద్ద‌రు జ‌గిత్యాల వాసులు కూడా చిక్కుకుని ప్రాణాలొదిలారు.

ఈ ఇద్ద‌రిని జ‌గిత్యాల జిల్లా రాయిక‌ల్ మండ‌ల ప‌రిధిలోని అయోధ్య, రామారావుప‌ల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఒకరు ఉప్పు ర‌మాదేవి కాగా, మ‌రొక‌రు వెంక‌టేశ్‌గా పోలీసులు గుర్తించారు. కార్మికులైన వీరిద్ద‌రూ ఉపాధి కోసం ఏపీకి వెళ్లిన‌ట్లు తెలిసింది. అయితే మొత్తం 8 మంది జ‌గిత్యాల వాసులు ఉపాధి ప‌నుల నిమిత్తం నిన్న సాయంత్రం నిర్మ‌ల్ నుంచి ఏపీకి బ‌య‌ల్దేరారు. వీరు హ‌రికృష్ణ ట్రావెల్స్ బ‌స్సుల్లో బ‌య‌ల్దేరిన‌ట్లు తేలింది. 8 మందిల ఆరుగురు కోరుట్ల‌లో, మ‌రో ఇద్ద‌రు జ‌గిత్యాల‌లో బ‌స్సెక్కారు.

Advertisement

తాజావార్తలు

Advertisement