Jagga Reddy | జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులను ఖండించిన జగ్గారెడ్డి
Jagga Reddy | త్రినేత్ర.న్యూస్ : జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టలను (Midnight Arrests of Journalists) టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రంగా ఖండించారు. ఎవరినైనా విచారించాలంటే నోటీసులు ఇచ్చి, పిలవాలని కోరారు.
Jagga Reddy | త్రినేత్ర.న్యూస్ : జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టలను (Midnight Arrests of Journalists) టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రంగా ఖండించారు. సిట్ (SIT) అధికారులు దీనిపట్ల సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఎవరినైనా విచారించాలంటే నోటీసులు ఇచ్చి, పిలవాలని కోరారు. జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడం వలన ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని, ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కొన్ని చానళ్లలో మంత్రులు, ఉన్నతాధికారులపై వ్యక్తిగతంగా ఆధారాలు లేకుండా కించపరిచే విధంగా కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. ఆ విషయంలోనూ తాను తీవ్రంగా స్పందించానని చెప్పారు. అలాంటి వార్తలు వేయడం సమాజానికి మంచిది కాదని ఇలాంటిది జరగకూడదని చెప్పానన్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఆ స్థాయికి ఎదిగేందుకు వాళ్ళు ఎంత కష్టపడ్డారో.. వారి జీవితాలను ఇలా ప్రసారం చేయడం దుర్మార్గమని చెప్పానని వివరించారు.
వార్తల నేపథ్యంలో అసలు విషయాలేమిటి, దీనికి సూత్రధారులు ఎవరనేది తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిందని జగ్గారెడ్డి అన్నారు. ఇది మంచిదేనని, దానికి సజ్జనార్ (Sajjanar) వంటి సీనియర్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయడంతో నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సిట్ అధికారులు ఈ విషయంలో చాలా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎవరి మీద అయితే అనుమానం ఉన్నదో.. ఎవరినైతే విచారణ చేయాలని అనుకుంటున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిస్తే చాలా బాగుండేదన్నారు. పండుగ పూట సీనియర్ జర్నలిస్ట్ లను విచారణ పేరుతో మధ్యరాత్రి అరెస్టులు చేసి తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వం ఇబ్బందుల పాలు అవుతోందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారన్న వార్త ఒక భయాందోళనకు గురి చేస్తోందని చెప్పారు. ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా ఉపయోగేపడే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
సిట్ అధికారులు చాలా కూల్ మైండ్ తో సంయమనం పాటించి విచారణ జరిపాలని కోరారు. అటు అధికారులకు న్యాయం జరగాలని అన్నారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



