Harish Rao | జర్నలిస్టులా.. తీవ్రవాదులా.. : హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర.న్యూస్: పండుగ వేళ అర్ధరాత్రి సమయంలో జర్నలిస్టుల (Journalists) ను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ వికృత క్రీడలో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలిచేస్తారా అని సూటి ప్రశ్న
Harish Rao | త్రినేత్ర.న్యూస్: పండుగ వేళ అర్ధరాత్రి సమయంలో జర్నలిస్టుల (Journalists) ను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతగాని సర్కారు పండగపూట జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని ప్రశ్నించారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా అని దుయ్యబట్టారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ అరెస్టులను ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం చేస్తున్న దాడిగా అభివర్ణించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా, డిజిటల్ మీడియాపై కేసును విచారించేందుకు సిట్‌ను ఏర్పాటు చేసి, ఎవరిని కాపాడుతున్నారో, ఎవరిని వేటాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకుల స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గమని అన్నారు. "రేవంత్ రెడ్డీ.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ?" అని విమర్శించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Harish Rao | తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా: హరీశ్ రావు
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



