ICC Rankings | ఐసీసీ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా విరాట్..! 2021 తర్వాత మళ్లీ అగ్రస్థానానికి కింగ్ కోహ్లీ..!
ICC Rankings | టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి నంబర్ వన్ ప్లేస్‌కి చేరుకున్నాడు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు చేరుకోగా.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ రెండోస్థానానికి ఎగబాకాడు.
ICC Rankings | టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి నంబర్ వన్ ప్లేస్‌కి చేరుకున్నాడు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు చేరుకోగా.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ రెండోస్థానానికి ఎగబాకాడు. మిచెల్ కంటే కేవలం ఒకే రేటింగ్ పాయింట్‌తో విరాట్ అగ్రస్థానానికి చేరాడు. విరాట్ 785 పాయింట్లతో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలువగా.. మిచెల్ 784 పాయింట్లతో రెండోస్థానానికి ఎగబాకాడు.
53 నెలల తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ వన్డేల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. జూలై 2021 తర్వాత మళ్లీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇటీవల విరాట్ బ్యాట్‌తో అద్భుతం చేస్తున్నాడు. గతంలో ఫామ్ లేమితో పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డ విరాట్.. ఇటీవల ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో చివరి వన్డేలో అజేయంగా 74 పరుగులు చేశాడు. గత నాలుగు ఇన్సింగ్స్‌లో 135, 102, 65, 93 పరుగులు చేశాడు. వడోదరలో న్యూజిలాండ్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడంలో కోహ్లీ ఇన్సింగ్స్ కీలక పాత్ర పోషించింది.
విరాట్ తొలిసారిగా 2013 ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇది 11వ సారి. ఇప్పటి వరకు 825 రోజుల పాటు నంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. అన్నిరోజుల పాటు ఈ ర్యాంకులో కొనసాగిన టీమిండియా ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఇంతకు ముందు వివ్ రిచర్డ్స్ 2306 రోజులు, బ్రియాన్ లారా 2079, మైఖేల్ బెవాన్ 1361 రోజుల పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగారు.
ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో 28వేల పరుగులు పూర్తి చేశాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి ఈ ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 28వేల పరుగులు పూర్తి చేసిన సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర తర్వాత ఈ రికార్డు సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను సాధించాడు. వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ ఐదవ స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ 10వ స్థానంలో కొనసాగుతున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 11వ స్థానానికి చేరుకున్నాడు. బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఐదు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. నెంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచిన విరాట్‌కు బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది.
ఇక ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్లే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్‌గా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 బౌలింగ్ ర్యాంకులో వరుణ్ చక్రవర్తి, టీ20ల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ, టెస్టుల్లో ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐదుగురు ఆయా విభాగాల్లో టీమిండియా ప్లేయర్లు ఉండడం విశేషం.
𝗡𝘂𝗺𝗯𝗲𝗿 𝗢𝗡𝗘 👑
Congratulations to Virat Kohli - the Number One Batter in ICC Men's ODI Rankings 👏👏#TeamIndia | @imVkohli pic.twitter.com/yTWjSQlNb7
— BCCI (@BCCI) January 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






