Maoists | మరో 29 మంది మావోయిస్టులు లొంగుబాటు
Maoists | మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలో మరో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Maoists | త్రినేత్ర.న్యూస్ : మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలో మరో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులంతా నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీకి చెందిన వారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో దండాకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్ (DAKMS) అధినేత పోడియం బుద్రా ఉన్నట్లు పేర్కొన్నారు. గోగుండ ఏరియాకు చెందిన బుద్రా తలపై రూ. 2 లక్షల రివార్డు ఉంది. మిగతా వారంతా డీఏకేఎంఎస్, మిలీషియా, జనతా సర్కార్‌కు చెందిన వారని స్పష్టం చేశారు.
ఇటీవల గోగుండ ఏరియాలో ఏర్పాటు చేసిన భద్రతా శిబిరం.. మావోయిస్టుల లొంగుబాటులో కీలకపాత్ర పోషించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ శిబిరం ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతంలో నిరంతరం కూంబింగ్ నిర్వహించి, మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకున్నారు. దాంతో మావోయిస్టులకు లొంగుబాటు తప్పనిసరి అయింది.
అయితే గోగుండ ఏరియా మావోయిస్టులకు కంచుకోట లాంటింది. ఇక్కడ దట్టమైన అడవులు ఉండడంతో.. మావోయిస్టులు తలదాచుకునేవారు. మొత్తానికి గోగుండను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని, మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేశారు. చేసేదేమీ లేక మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవక తప్పలేదు. మావోయిస్టుల కంచుకోటను ఆధీనం చేసుకోవడంలో బలగాలు కీలకపాత్ర పోషించాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు.
జనవరి 8న దంతెవవాడ జిల్లాలో 63 మంది మావోయిస్టులు లొంగిపోగా, జనవరి 7న సుక్మాలో 26 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. 2025లో మొత్తం 1500 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్రం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Honesty of an auto driver | ఆపరేషన్ డబ్బులు ఆటోలోనే మరిచాడు.. గంటల్లోనే బాధితుడికిచ్చేశారు
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



