త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

K Srinivas | పాత్రికేయుల‌ను బ‌లి చేయొద్దు..! మాజీ ఎడిట‌ర్ కే శ్రీనివాస్

K Srinivas | అర్ధ‌రాత్రి పూట జ‌ర‌ల్నిస్టుల అక్ర‌మ అరెస్టుల‌ను పూర్వ సంపాద‌కులు కే శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న ఫేస్‌బుక్ వేదిక‌గా స్పందించారు.

S

Telangana | Published On Jan 14, 2026, 3.54 pm IST

K Srinivas | పాత్రికేయుల‌ను బ‌లి చేయొద్దు..! మాజీ ఎడిట‌ర్ కే శ్రీనివాస్
Advertisement

K Srinivas | త్రినేత్ర‌.న్యూస్ : అర్ధ‌రాత్రి పూట జ‌ర‌ల్నిస్టుల అక్ర‌మ అరెస్టుల‌ను పూర్వ సంపాద‌కులు కే శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న ఫేస్‌బుక్ వేదిక‌గా స్పందించారు. అర్ధ‌రాత్రి వేళ అక్ర‌మంగా అరెస్టు చేసిన ఆ ముగ్గురు జ‌ర్న‌లిస్టుల‌ను వెంట‌నే విడిచి పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అధికార ప‌క్షం అంత‌ర్గ‌త క్రీడ‌లో పాత్రికేయుల‌ను బ‌లి చేయొద్దు అని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌ను పోలీసులు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. వీరి అరెస్టుల‌ను ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన నేత‌లు, జ‌ర్న‌లిస్టు సంఘాలు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక ఎన్టీవీ ఆఫీసులోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన పోలీసులు.. ఉద్యోగులను ఆందోళ‌న‌కు గురి చేశారు. ఎన్టీవీ ఆఫీసులో సర్వర్లు లాగేసి, కంప్యూటర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్టీవీ ఆఫీసులో పోలీసుల సోదాలు నిర్వ‌హించ‌డాన్ని జ‌ర్న‌లిస్టు సంఘాలు త‌ప్పుబ‌డుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement