త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIT | సిట్ దూకుడు.. మహిళా ఐఏఎస్​ను కించపరిచిన కేసులో అర్ధ‌రాత్రి ముగ్గురు జ‌ర్న‌లిస్టులు అరెస్ట్‌

SIT | రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన మంత్రి, ఓ మ‌హిళా ఐఏఎస్ అధికారిణి (IAS Officer) ప్రేమాయ‌ణం అంతూ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసిన‌ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది.

G

Telangana | Published On Jan 14, 2026, 10.22 am IST

SIT | సిట్ దూకుడు.. మహిళా ఐఏఎస్​ను కించపరిచిన కేసులో అర్ధ‌రాత్రి ముగ్గురు జ‌ర్న‌లిస్టులు అరెస్ట్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన మంత్రి, ఓ మ‌హిళా ఐఏఎస్ అధికారిణి (IAS Officer) ప్రేమాయ‌ణం అంతూ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసిన‌ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. ప్ర‌ముఖ చాన‌ళ్ల‌కు చెందిన ముగ్గురు జ‌ర్న‌లిస్టుల‌ను సీసీఎస్ పోలీసులు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

మహిళా ఐఏఎస్ అధికారినిని కించపరిచే వార్తలు ప్ర‌సారం చేసిన వ్యవహరంలో ఐఏఎస్‌ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్‌ రంజన్ ఫిర్యాదుతో సీసీఎస్​లో కేసు నమోదు అయింది. రెండు తెలుగు న్యూస్ చానెళ్ల‌తో సహా ఏడు యూట్యూబ్ ఛానెళ్లపై 75, 78, 79, 351(1), 352(2) బీఎన్​ఎస్​ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను అసభ్యకరంగా రూపొందించి వాట్సాప్​ గ్రూప్​ల్లో పోస్ట్ చేసిన వ్యవహారంలో దర్యాప్తునకు హైద‌రాబాద్ సీపీ సజ్జ‌నార్ నేతృత్వంలో డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (SIT) ఏర్పాటుచేశారు. ఇందులో సభ్యులుగా నార్త్‌ రేంజ్‌ జాయింట్‌ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌, హైదరాబాద్‌ అడ్మిన్‌ డీసీపీ వెంకటలక్ష్మి, సీసీఎస్‌ ఏసీపీ గురు రాఘవేంద్ర, సైబర్‌ క్రైమ్‌ డీసీపీ అరవింద్‌ బాబు, విజిలెన్స్‌ అదనపు ఎస్పీ ప్రతాప్‌, సైబర్‌సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి, సైబర్‌సెల్‌ ఎస్సై హరీశ్‌ ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement