త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | రాహుల్ సింహం.. ప్రియాంక పులి : జ‌గ్గారెడ్డి

Jagga Reddy | దేశ రాజధాని ఢిల్లీలో బుధ‌వారం జ‌రిగిన భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ క‌ర్గేల‌కు సీట్లు కేటాయించిన విధానంపై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

P

Telangana | Published On Jan 27, 2026, 8.19 pm IST

Jagga Reddy | రాహుల్ సింహం.. ప్రియాంక పులి : జ‌గ్గారెడ్డి
Advertisement

Jagga Reddy | దేశ రాజధాని ఢిల్లీలో బుధ‌వారం జ‌రిగిన భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ క‌ర్గేల‌కు సీట్లు కేటాయించిన విధానంపై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. బుధ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఆయ‌న మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజకీయ సంప్రదాయం ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలాంటి సంప్రదాయం వచ్చింది? అంటూ ప్ర‌శ్నించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ సంప్రదాయాలు పాటించార‌న్నారు. ప్రధాని జెండా ఎగరేస్తే.. ప్రతిపక్ష నాయకుడు ముందు వరుసలో కూర్చోబెట్టేవార‌న్నారు. అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద, ప్రజలు ఇచ్చిన హక్కు అన్నారు. జనవరి 26 వేడుకల్లో రాహుల్ గాంధీని మూడో లైన్‌లో కూర్చోబెట్టి అవ‌మాన‌ప‌రిచార‌ని, బీజేపీ ప్రవర్తన ప్రజలు గమనించాల‌న్నారు.

మోదీ ప్రభుత్వం సాంప్రదాయాలు పక్కన పెట్టింద‌ని, రాహుల్ గాంధీ ఏం ఫీల్ కారు.. ఎందుకు అంటే రాహుల్ గాంధీ ఇంట్లోనే ప్రధాని పోస్ట్ పుట్టింద‌న్నారు. మోదీ ఇంట్లో ప్రధాని పోస్ట్ పుట్టలేద‌న్నారు. ప్రధాని పోస్టు పుట్టిందే రాహుల్ గాంధీ ఇంట్లో అని.. న్యాయమైన పాలన..పేదలకు అండగా ఉండే పాలన.. అందించింది రాహుల్ గాంధీ కుటుంబమ‌ని తెలిపారు. ఐదో వరుసలో కూర్చోబెట్టినా... రాహుల్ గాంధీ ఏం ఫీల్ కార‌ని.. 47 ఏండ్లు రాహుల్ గాంధీ కుటుంబం దేశాన్ని పాలించింద‌ని తెలిపారు. పద్దతి లేని పాలన.. కనపడుతుంద‌ని విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ ఆలోచన, మాట, ప్రవర్తన అంతా సింహంలా ఉంటుంద‌న్న ఆయ‌న‌.. సింహంనికి సింహాసనం అవసరం లేద‌ని.. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాస‌న‌మ‌న్నారు.

మోదీ సింహాసనం మీద కూర్చుంటేనే.. ప్రధాని అంటార‌ని వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో మోదీనీ పులి లెక్క వెంటాడింద‌ని.. బీజేపీనీ దేశ ప్రజలు మంచి పాలన ఇవ్వండ‌ని అధికారం ఇచ్చార‌న్నారు. రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని అధికారం ఇవ్వలేదన్నారు. రాహుల్ గాంధీ కుటుంబంపై రాజకీయంగా కుట్రలు చేయడం మానుకోవాల‌ని, వాజ్‌పేయి లాంటి వాళ్లు పార్లమెంట్‌లో ఉండాల‌ని.. ప్రతిపక్షం సభలో ఉంటేనే లోటుపాట్లు తెలుస్తాయ‌ని ఇందిరా గాంధీ గౌర‌వం ఇచ్చేద‌న్నారు. వాజ్‌పేయి, అద్వానీ లాంటి వాళ్లకు ముందు వరుసలో కూర్చోబెట్టి మర్యాద ఇచ్చింది ఇందిరా, రాజీవ్ గాంధీ అని.. ఎందుకు సంప్రదాయాలు పక్కన పెడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ధర్మం అంటారు.. దాన్ని పాటించర‌ని, దేవుడు అంటారు పద్ధతులు పాటించరని విమ‌ర్శించారు. ప్రధాన మంత్రులు వస్తారు పోతార‌ని.. కానీ చరిత్రను కాలరాయలేర‌న్నారు. ఒక్క నిజాంను వదిలేసి.. మిగిలిన నిజాం నవాబులను ప్రజలు గుర్తు చేసుకుంటార‌న్నారు. బీజేపీ ఎంత సేపు ప్రజల్లోకి చెడును ఎలా జొప్పించాలి అనేది చూస్తుంద‌ని, ప్రజలను ట్రాప్ చేయడం ఎలా అనేదే బీజేపీ పాలసీ.. అంతకు మించి ఏం లేద‌ని జ‌గ్గారెడ్డి మండిప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement